అంత్యక్రియలు నిర్వహించిన గంభీర్.. ఎవరివో తెలిస్తే షాక్!!

ఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్, తూర్పు ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. మహమ్మారి కరోనాపై జరుగుతున్న పోరులో తమ వంతు సాయంగా రెండేళ్ల వేతనాన్ని ప్రధాన మంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చిన గంభీర్.. తాజాగా తన ఇంట్లో పని చేస్తున్న సహాయకురాలి అంత్య క్రియలను నిర్వహించారు. అనంతరం ఆమెకు ట్విట్టర్ పేజీలో నివాళి అర్పించారు.

పనిమనిషి అంత్యక్రియలు:
సరస్వతి పాత్ర ఆరేళ్లుగా బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఇంట్లో సహాయకురాలిగా పని చేస్తున్నారు. సరస్వతి ఇటీవలే అనారోగ్యం పాలైంది. ఢిల్లీలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. కరోనా వైరస్ వ్యాప్తితో ప్రస్తుతం దేశం మొత్తం లాక్డౌన్ ఉన్న కారణంగా.. సరస్వతి మృత దేహాన్ని ఒడిశాలోని అమె కుటుంబానికి పంపలేని పరిస్థితి. దీంతో గంభీర్ స్వయంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయాన్ని శుక్రవారం ట్విట్టర్ ద్వారా మాజీ ఓపెనర్ తెలిపారు.

ఎప్పటికీ పని మనిషి కాదు:
'నా పిల్లలను జాగ్రత్తగా చూసుకున్న ఆమె (సరస్వతి పాత్ర) ఎప్పటికీ పని మనిషి కాదు. ఆమె నా కుటుంబ సభ్యురాలు. ప్రస్తుత పరిస్థితుల్లో సరస్వతి అంత్యక్రియలు నిర్వహించడం నా బాధ్యత. కులం, మతం, ప్రాంతం, సామాజిక పరిస్థితులతో సంబంధం లేకుండా.. అందరినీ గౌరవించాలని నేను ఎప్పుడూ నమ్ముతాను. అదే నా దేశం ఆలోచన. ఓ శాంతి' అని గంభీర్ ట్వీట్‌లో రాసుకోచ్చారు.

గొప్ప మనసు చాటుకున్నారు:
గౌతమ్ గంభీర్‌ను కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్విట్టర్ వేదికగా అభినందించారు. 'అనారోగ్యం పాలైన సరస్వతిని గంభీర్ జాగ్రత్తగా చూసుకున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో అంత్యక్రియలు నిర్వహించి గొప్ప మనసు చాటుకున్నారు. మరణంలో కూడా ఆమెపై గౌరవాన్ని చూపారు. ఈ ఘటన ఎంతోమంది పేదలకు విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. సమాజంలోని అన్ని వర్గాల నుండి గౌతీ గౌరవాన్ని అందుకుంటారు' అని ప్రధాన్ ట్వీట్ చేసారు.

తీవ్రమైన రక్తపోటు కారణంగా:
49 ఏళ్ల సరస్వతి పాత్ర తీవ్రమైన రక్తపోటు కారణంగా కొన్ని రోజుల క్రితం ఢిల్లీలోని శ్రీరామ్ గంగ దవాఖానాలో చేరారు. అనారోగ్యం తీవ్రమవడంతో ఈ నెల 21వ తేదీన ఆమె కన్నుమూశారు. సరస్వతి ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన వారు అని ఒడిశాలో మీడియా కథనాలు ప్రచురించింది. 38 ఏళ్ల గంభీర్ 2004 మరియు 2016 మధ్య భారతదేశం తరఫున 58 టెస్టులు ఆడారు. 147 వన్డేలు, 37 టీ20లు కూడా ఆడారు. 2007, 20119 ప్రపంచకప్ జట్టులలో సభ్యులు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications