ఇది ఓటమి కాదు గివప్ అంటూ లక్నో ప్లేయర్లకు క్లాస్ పీకిన గంభీర్

మాజీ టీమిండియా ప్లేయర్, మాజీ కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్, ప్రస్తుత లక్నో టీం మెంటార్ గౌతమ్ గంభీర్.. గుజరాత్ టీంతో నిన్న లక్నో సూపర్ జెయింట్స్ టీం ఓడిపోయాక మాట్లాడాడు. టీం ఓటమి తీరు పట్ల క్లాస్ పీకాడు. మంగళవారం రాత్రి పూణెలోని ఎంసీఏ స్టేడియంలో జరిగిన టాప్-ఆఫ్-ది-టేబుల్ పోరులో గుజరాత్ టైటాన్స్ లక్నోపై 62పరుగుల భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్ భారీ ఓటమిని గంభీర్ నిర్మొహమాటంగా ప్రస్తావిస్తూ.. గేమ్ పరంగా ఆటగాళ్ల వైఖరిపై కఠినంగా స్పందించాడు. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో జట్టును ఉద్దేశించి గంభీర్ క్లాస్ పీకాడు. దీంతో కిమ్మనకుండా ప్లేయర్లందరు బుద్ధిగా విన్నారు.

చాలా టఫ్ పిచ్
ఇక ఈ మ్యాచ్‌లో గెలిచిన గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. చాలా టఫ్ పిచ్‌పై జరిగిన ఈ మ్యాచ్‌లో బ్యాటర్లకు అంతగా హిట్టింగ్ సాధ్యపడలేదు. ఫ్రీ ఫ్లోయింగ్ స్ట్రోక్స్, సిక్స్‌లు కొట్టడానికి వీలు పడకుండా బంతి చాలా టఫ్ స్వింగ్, సీమ్‌తో బ్యాటర్ల వైపు దూసుకొచ్చింది. ఇలాంటి పిచ్‌పై బంతితో అద్భుతంగా రాణించిన గుజరాత్ గొప్ప విజయాన్ని అందుకున్న ఐపీఎల్ ప్లేఆఫ్ చేరిన మొదటి జట్టుగా నిలిచింది.

ఓడిపోవడంలో తప్పు లేదు.. వదులుకోవడంలోనే తప్పుంది
మ్యాచ్ అనంతరం గంభీర్ మాట్లాడుతూ.. 'ఓటమిలో తప్పు లేదు. ఓటమి కచ్చితంగా మంచిది. ఒక జట్టు గెలవాలి, ఒక జట్టు ఓడిపోవాలి. ఓడిపోవడంలో కాదు మ్యాచ్ వదులుకోవడంలోనే తప్పు ఉంది. ఈ రోజు మనం ఓడిపోలేదు.. మ్యాచ్‌ను వదులుకున్నాం. మనం చాలా బలహీనంగా గివప్ ఇచ్చేశాం' అని గంభీర్ పేర్కొన్నాడు. గంభీర్ మాట్లాడుతుండగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో సహా ఆటగాళ్లు చాలా శ్రద్ధగా విన్నారు. ఈ వీడియోను లక్నో ఫ్రాంచైజీ రిలీజ్ చేసింది.

గేమ్ సెన్స్ లోపించింది.
ఇక గంభీర్ గతంలో జట్టు ప్రదర్శన గురించి ప్రస్తావిస్తూ.. 'నిజాయితీగా చెప్పాలంటే ఐపీఎల్‌లో కానీ, క్రీడల్లో కానీ బలహీనులకు చోటు లేదు. ఐపీఎల్లో మనం చాలా జట్లను ఓడించాం, ఈ పోటీలో మనం చాలా మంచి జట్లతో ఆడి గెలిచాం. కానీ ఈ రోజు నేను అనుకుంటున్నదేంటంటే మన ఆటలో గేమ్ సెన్స్ లోపించింది. అది చాలా ముఖ్యమైంది. ఆ గేమ్ సెన్స్ లేకుంటే మనం నిలబడలేం' అన్నాడు.

ఆ మోటివ్‌తోనే మనం ఆడాలి
'గుజరాత్ బౌలర్లు బాగా బౌలింగ్ చేస్తారని మనకు తెలుసు. వారి బౌలింగ్ గురించి మనం ముందే ఊహించాం. అయినా కానీ ఎదుర్కోలేకపోయాం. ఐపీఎల్ అంటే అంతర్జాతీయ స్థాయి బౌలర్లతో ఆడే ప్రపంచ స్థాయి పోటీ. ప్రతి బౌలర్ ఇక్కడ రాణించాలనుకుంటాడు. బౌలర్లకు మనం సవాల్ విసరాలని కోరుకోవాలి. ఆ మోటివ్‌తోనే ఆడాలి' అని గంభీర్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications