గంభీర్ ఫైర్.. ధోనీ ఇష్టమైన సిరీసులే ఆడతానంటే కుదరదు!!

న్యూఢిల్లీ: మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ మరోసారి తన నోటికి పని చెప్పాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ జట్టుకు ఎందుకు దూరంగా ఉంటున్నాడో చెప్పాలి. ధోనీ తనకు ఇష్టష్టమైన సిరీసులే ఆడతానంటే కుదరదు అని గంభీర్ ఫైర్ అయ్యాడు. ఇక మొన్నటివరకు యువ వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌పై మండిపడ్డ గంభీర్.. తాజాగా మాట మార్చాడు. పంత్‌కు మరిన్ని అవకాశాలు ఇస్తేనే సబబుగా ఉంటుందని పేర్కొన్నాడు.
ధోనీ గురించి తాజాగా గంభీర్ మాట్లాడుతూ... 'రిటైర్మెంట్ అనేది వ్యక్తిగత నిర్ణయం. ఇక్కడ ధోనీ అయినా వేరే వాళ్లయినా ఇష్టమున్నప్పుడు రిటైర్ అవుతారు. ధోనీ ప్రణాళికలు ఏమిటో సెలక్టర్లు ముందు తెలుసుకోవాలి. అసలు భారత్‌కు మళ్లీ ఆడతాడా.. లేదా అనే విషయాన్ని అడిగి తెలుసుకోండి. ఒక ఆటగాడు భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ.. తనకిష్టమైన సిరీసులే ఆడతానంటే కుదరదు' అని అన్నాడు.
'పంత్‌కు మేనేజ్‌మెంట్ అండగా నిలబడాలి. అతడు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి చాలా తక్కువ సమయమే అవుతుంది కాబట్టి అతనిపై ప్రధానంగా దృష్టి సారించాలి. టెస్టుల్లో పంత్ ఇప్పటికే రెండు సెంచరీ చేశాడు. ఈ శతకాలు చేయడానికి పంత్ పెద్దగా సమయం తీసుకోలేదు. అతని మార్క్ ఆటతోనే పంత్‌ను ఆడనివ్వండి. పంత్ ఆటపై ఇప్పుడే విమర్శలు చేసి అతనిపై ఒత్తిడి పెంచడం సరైనది కాదు' అని గంభీర్ పేర్కొన్నాడు.
మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ సరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంపై మాట్లాడటం కష్టం అని పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌కు జస్ప్రీత్ బుమ్రా దూరమవ్వడం బాధాకరం. ప్రపంచంలో బుమ్రా అద్భుతమైన పేసర్. ప్రపంచకప్‌లో ఐదు శతకాలు బాదిన రోహిత్‌కు టెస్టుల్లో చోటు దక్కడంలో ఆశ్చర్యం ఏమీ కలగలేదు. అతడిని సిరీస్‌కు ఎంపిక చేస్తే.. తుది 11 మందిలోనూ ఎంపిక చేయాలని గంభీర్ సూచించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications