Gambhir Comments on Buttler: 'వరల్డ్ టీ20 బెస్ట్ బ్యాట్స్‌మన్‌లలో బట్లర్ ఒకడు.. ఏ బౌలర్ అతడిని అడ్డుకో

ఢిల్లీ: ఇంగ్లండ్ వికెట్‌కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్‌పై టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించాడు. బట్లర్ అసాధారణ ఆటగాడని, వరల్డ్ టీ20 బెస్ట్ బ్యాట్స్‌మన్‌లలో ఒకడని పేర్కొన్నాడు. బట్లర్ ఫామ్‌లో ఉంటే అతడిని ఏ బౌలర్ కూడా అడ్డుకోలేడని గంభీర్ అన్నాడు. టీమిండియాతో అహ్మదాబాద్‌లో జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. 8 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన బట్లర్ (52 బంతుల్లో 83 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు.

బట్లర్ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్:
తాజాగా గౌతమ్ గంభీర్ ఈఎస్‌పీఎన్-క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ... 'జోస్ బట్లర్ ఆట అద్భుతం. అతడు అసాధారణ ఆటగాడు. నాకు తెలిసి రోహిత్ శర్మతో పాటు వరల్డ్ టీ20 బెస్ట్ బ్యాటర్లలో బట్లర్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. బట్లర్ ఒక మంచి ఇంగ్లిష్ వైట్‌బాల్ బ్యాట్స్‌మన్ అని ఇయాన్ బెల్ ఇప్పుడే అన్నారు. వాస్తవానికి ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అని నా అభిప్రాయం. ఫాస్ట్ బౌలర్లు అయినా, స్పిన్నర్లు అయినా తను వెనక్కి తగ్గడు. తను ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే అతడిని ఆపడం ఏ బౌలర్ తరం కాదు' అని అన్నాడు.

బుమ్రా లేని లోటు కనిపిస్తోంది:
మూడో టీ20లో టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించిందని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. 'మూడో టీ20లో జస్ప్రీత్ బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించింది. శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా వంటి బౌలర్లకు జోస్ బట్లర్‌ను ఆపడం చాలా కష్టం' అని గంభీర్ చెప్పుకొచ్చాడు. గురువారం జరుగనున్న నాలుగో టీ20లో ఇంగ్లండ్‌ను మట్టికరిపిస్తేనే భారత్ సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. మూడో టీ20లో ఓడి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-2తో వెనుకబడ్డ కోహ్లీసేన మెరుగైన ప్రదర్శన చేయాలని పట్టుదలగా ఉంది. 2-2తో సమం చేసి సిరీస్ ఫలితాన్ని చివరి మ్యాచ్‌కు తీసుకెళ్లాలని కసితో ఉంది.

సూర్యను ఎలా పక్కన పెడతారు:
సూర్యకుమార్ యాదవ్‌ను తప్పిస్తూ విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని గౌతీ అన్నాడు. అతనికి బదులు ఇంకెవరినైనా పక్కకు పెట్టాల్సిందన్నాడు. 'కోహ్లీ నిర్ణయం నాకు ఆశ్చర్యం కలిగించింది. మరో ఏడు నెలల్లో టీ20 ప్రపంచకప్ ఉంది. ఈ సందర్భంలో ఇలాంటి నిర్ణయాలు సరైనవి కావు. సూర్యకు ఎలాంటి గాయాలు లేవు. అతని బ్యాటింగ్ తీరు చూసిందీ లేదు. మరి అలాంటపుడు అతడిని ఎలా పక్కకు పెడతారు. ప్రపంచకప్ సమయంలో నాలుగు, ఐదో స్థానంలో ఎవరైన గాయపడితే అతడికి బ్యాకప్ ప్లేయర్ ఉండాలి. అయ్యర్ స్థానంలో ఆడే ఆటగాడు ఎవరనేది ఆలోచించారా?. ఇప్పటికే ఆ స్థానంలో మరో ఆటగాడిని ప్రయత్నించాలి. మూడు, నాలుగు మ్యాచ్‌లు సూర్యకు అవకాశం ఇచ్చి అతడు ఎలా ఆడతాడో చూడాలి. ఒకవేళ మెరుగైన ప్రదర్శన చేస్తే నాలుగో స్థానంలో ఓ బ్యాట్స్‌మెన్ దొరికినట్లే' అని చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications