For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒత్తిడికి లోనయ్యా: కుమార్తె బౌలింగ్‌‌లో గంభీర్ బ్యాటింగ్ (వీడియో)

క్రికెట్ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు గౌతం గంభీర్. ఎంతో మంది బౌలర్లను సమర్ధవంతగా ఎదుర్కొన్నాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: క్రికెట్ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు గౌతం గంభీర్. ఎంతో మంది బౌలర్లను సమర్ధవంతగా ఎదుర్కొన్నాడు. అలాంటిది ఓ చిన్నారి వేసిన బంతులను ఎదుర్కొనేందుకు చాలా ఒత్తిడిగా ఫీలయ్యానంటూ గంభీర్‌ చేసిన వీడియో ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌ అయింది.

గంభీర్ తన నాలుగేళ్ల కుమార్తె ఆజీన్‌ చదువుతోన్న స్కూల్లో ఇటీవల నిర్వహించిన ఓ ఈవెంట్‌కు గంభీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. గంభీర్ బ్యాటింగ్ చేసి స్కూలు చిన్నారులను ఆనందానికి గురి చేశాడు. ఈ సందర్భంగా స్కూలు యాజమాన్యం గంభీర్‌ కూతురు ఆజీన్‌ చేతికి బంతి ఇచ్చి బౌలింగ్ వేయించింది.

కుమార్తె వేసిన బంతిని గంభీర్‌ ఎంతో ఒత్తిడిలో ఆడినట్లు పేర్కొంటూ గంభీర్ ఓ వీడియో పోస్టుని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు. 'నాకు ఔట్‌ సైడ్‌ ది ఆఫ్‌ స్టంప్‌ వేయాలని నా కూతురు ఆజీన్‌కు తెలుసు. ఆజీన్‌ బౌలింగ్‌ ఆడటానికి ఎంతో ఒత్తిడికి లోనయ్యాను' అని గంభీర్‌ చేసిన వీడియో వైరల్ అయింది.

ఈ ట్వీట్ చూసిన షారుక్‌ వెంటనే స్పందించారు. షారుక్‌ యజమానిగా వ్యవహరిస్తున్న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టుకి గంభీర్‌ కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షారుక్‌ గంభీర్‌ ట్వీట్‌కు స్పందిస్తూ 'కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరఫున బౌలింగ్‌ చేయమని చెప్పవా ప్లీజ్‌' అని షారు ట్వీట్‌ పెట్టారు.

Story first published: Monday, November 13, 2017, 12:18 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+