Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెహ్వాగ్‌ను పృథ్వీ షాతో పోల్చడం సరికాదు: వివరించిన గంభీర్

 Gautam Gambhir explains why it is wrong to compare Prithvi Shaw with Virender Sehwag

హైదరాబాద్: టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా‌ని డాషింగ్‌ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో పోల్చేవారు పునరాలోచించుకోవాలని వెటరన్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సూచించాడు. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా వెస్టిండిస్‌తో గత శనివారం ముగిసిన తొలి టెస్టులో పృథ్వీ షా‌ (134) సెంచరీతో రాణించిన సంగతి తెలిసిందే.

తద్వారా ఆడిన మొదటి టెస్టులోనే సెంచరీ సాధించిన 15వ భారత క్రికెటర్‌గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా అతను కొడుతున్న షాట్లకు మాజీ క్రికెటర్లు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌లా పృథ్వీ షా‌ ఆడుతున్నాడంటూ పోలుస్తున్నారు.

పృథ్వీ షా‌‌ని ఎవరైతే సెహ్వాగ్‌తో పోలిక తెస్తున్నారో?

పృథ్వీ షా‌‌ని ఎవరైతే సెహ్వాగ్‌తో పోలిక తెస్తున్నారో?

ఈ నేపథ్యంలో గౌతమ్ గంభర్ మాట్లాడుతూ "పృథ్వీ షా‌‌ని ఎవరైతే సెహ్వాగ్‌తో పోలిక తెస్తున్నారో? వారు పునరాలోచించుకోవాలి. నిజానికి ఎవరినీ.. ఎవరితో పోల్చడం మంచిది కాదు. పృథ్వీ షా‌‌ ఇప్పుడే కెరీర్‌ని ప్రారంభించాడు. అతను ఇంకా సుదీర్ఘకాలం ఆడాల్సి ఉంది. అప్పుడే.. ఇలా పోలికలు తేవడాన్ని నేను సమర్థించను. ఎవరి ఆట వారిది" అని చెప్పుకొచ్చాడు.

అరంగేట్ర టెస్టులోనే పృథ్వీ షా‌‌ చాలా చక్కగా ఆడాడు

అరంగేట్ర టెస్టులోనే పృథ్వీ షా‌‌ చాలా చక్కగా ఆడాడు

"అరంగేట్రం టెస్టులోనే పృథ్వీ షా‌‌ చాలా చక్కగా ఆడిన మాట నిజమే. కానీ.. రాబోయే రోజుల్లో అతను కఠినమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది" అని గంభీర్ వివరించాడు. కాగా, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య రెండో టెస్టు శుక్రవారం నుంచి హైదరాబాద్ వేదికగా ప్రారంభం కానుంది.

హైదరాబాద్ టెస్టులో షా కోసం మరో రికార్డు

హైదరాబాద్ టెస్టులో షా కోసం మరో రికార్డు

ఈ రెండో టెస్టులో పృథ్వీ షా మరో రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది. తాను ఆడిన తొలి టెస్టులోనే ఇప్పటివరకూ మొత్తం 15 మంది భారత బ్యాట్స్‌మెన్‌ సెంచరీలు సాధించగా, ఇందులో ముగ్గురు వరుసగా రెండో టెస్టులోనూ సెంచరీ చేశారు. ఈ జాబితాలో సౌరవ్‌ గంగూలీ, అజహరుద్దీన్‌, రోహిత్‌ శర్మలు ఉన్నారు.

రెండో టెస్టులో సెంచరీ సాధిస్తే

రెండో టెస్టులో సెంచరీ సాధిస్తే

రెండో టెస్టు మ్యాచులోనూ పృథ్వీ షా సెంచరీ నమోదు చేస్తే ఈ ముగ్గురి సరసన నిలుస్తాడు. అజహరుద్దీన్ 1984లో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఈ రికార్డు నెలకొల్పగా... అనంతరం 1996లో అదే జట్టుతో జరిగిన జరిగిన టెస్టు సిరీస్‌లో గంగూలీ ఈ రికార్డు సాధించాడు. ఇక 2013లో వెస్టిండిస్‌తో కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టు మ్యాచు ద్వారా ఆరంగేట్రం చేసిన రోహిత్‌ శర్మ ఆ మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. ఆ తర్వాత ముంబైలో జరిగిన రెండో టెస్టులోనూ సెంచరీ సాధించి వరుసగా రెండు మ్యాచుల్లో సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు.

Story first published: Thursday, October 11, 2018, 15:01 [IST]
Other articles published on Oct 11, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+