Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కెప్టెన్‌గా చరిత్ర: ధోని, దాదా, ద్రవిడ్‌ల కంటే భిన్నంగా విరాట్ కోహ్లీ

IND vs SA : Gambhir Explains What Separates Kohli From Others
Gautam Gambhir explains what separates captain Kohli from Dhoni, Ganguly and Dravid

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ నిర్భయమైన వైఖరి, విదేశీ పరిస్థితులపై కూడా టెస్ట్ విజయాలు సాధించాలనే మనస్తత్వం అతడిని భారత మాజీ కెప్టెన్లు ధోని, గంగూలీ, ద్రవిడ్‌లతో పోలిస్తే భిన్నంగా ఉంచుతోందని గంభీర్ అన్నాడు.

ఏ కెప్టెన్‌ సాహసించని నిర్ణయాలను విరాట్ కోహ్లీ తేలిగ్గా తీసుకుంటాడని కొనియాడాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా పూణె వేదికగా జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా టీమిండియా ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో విజయం సాధించడంతో మరో టెస్ట్ మిగిలుండగానే సిరిస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది.

సొంతగడ్డపై టీమిండియాకు ఇది వరుసగా 11వ టెస్టు సిరిస్ విజయం కావడం విశేషం. ఈ క్రమంలో టీమిండియా అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ఈ నేపథ్యంలో గంభీర్ మాట్లాడుతూ "ఓటమి గురించి మీరు భయపడితే ఎప్పటికీ విజయం సాధించలేరు. ఓటమిని లెక్కచేయకుండా కోహ్లీ బరిలోకి దిగుతాడు. అదే అతడి బలం" అని అన్నాడు.

ఎన్నో విజయాలు

ఎన్నో విజయాలు

"కెప్టెన్లుగా గంగూలీ, ధోనీ, ద్రవిడ్‌ జట్టుకు ఎన్నో విజయాలు అందించారు. కానీ, కెప్టెన్‌గా కోహ్లీ చరిత్ర సృషించాడు. స్వదేశంలో పాటు విదేశాల్లోనూ తన విజయ పరంపర కొనసాగిస్తున్నాడు. ఏ కెప్టెన్‌ సాహసం చేయలేని నిర్ణయాలను కోహ్లీ తేలిగ్గా తీసుకుంటాడు. మిగతా కెప్టెన్లంతా అదనపు బ్యాట్స్‌మన్ జట్టులో ఉండాలని కోరుకుంటారు" అని స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్యూలో గంభీర్ తెలిపాడు.

మ్యాచ్‌ని కోల్పోకుండా

మ్యాచ్‌ని కోల్పోకుండా

"ఇలా చేయడం వల్ల టెస్టు మ్యాచ్‌ని కోల్పోకుండా ఉంటామని వారి ఆలోచన. కానీ, కోహ్లీ ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగుతాడు. అల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా అదనం. విదేశాల్లోనూ కోహ్లీ ఇదే ప్రణాళికతో బరిలోకి దిగి విజయవంతమయ్యాడు. ఇలాంటి సాహాసాలు చేయగలిగేది కోహ్లీ మాత్రమే" అని గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు.

రెండో టెస్టులో టీమిండియా విజయం

రెండో టెస్టులో టీమిండియా విజయం

పూణె వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా విజయం సాధించడంతో మూడు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో సిరిస్‌ను కైవసం​ చేసుకోవడం ద్వారా టీమిండియా టెస్టు క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలో టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియా జట్టు పేరిట ఉన్న రికార్డుని బద్దలు కొట్టింది.

స్వదేశంలో అత్యధిక టెస్టు సిరిస్ విజయాలను

స్వదేశంలో అత్యధిక టెస్టు సిరిస్ విజయాలను

స్వదేశంలో అత్యధిక టెస్టు సిరిస్ విజయాలను నమోదు చేసిన జట్టుగా టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాపై టీమిండియా నెగ్గిన టెస్టు సిరీస్‌ స్వదేశంలో వరుసగా 11వది కావడం విశేషం. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా రికార్డును కోహ్లీసేన అధిగమించింది. 1994-95 సీజన్‌ మొదలు కొని 2000-01 సీజన్‌ వరకూ ఆస్ట్రేలియా సొంతగడ్డపై వరుసగా 10 టెస్టు సిరిస్ విజయాలను నమోదు చేసింది.

అక్టోబర్ 19న రాంచీ వేదికగా మూడో టెస్టు

అక్టోబర్ 19న రాంచీ వేదికగా మూడో టెస్టు

ఆ తర్వాత 2004-09 సీజన్‌ మధ్యలో ఆస్ట్రేలియా మరోసారి 10 వరుస స‍్వదేశీ టెస్టు సిరీస్‌ విజయాలు సాధించింది. అయితే, ఇప్పుడు ఆ రికార్డుని టీమిండియా బద్దలు కొట్టింది. 2012-13 సీజన్‌ నుంచి ఇప్పటివరకూ భారత్‌ వరుసగా 11 టెస్టు సిరీస్‌ విజయాల్ని నమోదు చేసింది. అక్టోబర్ 19న రాంచీ వేదికగా ఇరు జట్ల మధ్య ఆఖరి టెస్టు జరగనుంది.

Story first published: Monday, October 14, 2019, 12:03 [IST]
Other articles published on Oct 14, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+