Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గంభీర్ కథ ముగిసినట్లే?: కోహ్లీపై ట్విట్టర్‌లో విమర్శలు

హైదరాబాద్: రెండేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం అన్ని అడ్డంకులను అధిగమించి భారత టెస్టు జట్టులోకి గంభీర్ ఎంపికయ్యాడు. అయితే రెండు మ్యాచ్‌లు ఆడాడో లేదో అప్పుడే ఉద్వాసనకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా మిగిలిన మూడు టెస్టులకు బీసీసీఐ మంగళవారం 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది.

ఈ జట్టులో గంభీర్ స్ధానం కోల్పోయాడు. ఈ నేపథ్యంలో గంభీర్‌పై వేటు సమంజసమేనా? ఇంతటితో గంభీర్ కెరీర్‌ ముగిసినట్లేనా? అంటే అవుననే అంటున్నారు క్రీడా విశ్లేషకులు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శనను కనబర్చిన గంభీర్... జట్టు ఓపెనర్లు శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ గాయపడడంతో జట్టులోకి వచ్చాడు.

జట్టులోకి తిరిగి చోటు దక్కించుకున్న తర్వాత గంభీర్ ఆడింది రెండు టెస్టులే. న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి టెస్టులో 29, 50 పరుగులు నమోదు చేయగా, ఇంగ్లాండ్‌తో రాజ్ కోట్‌లో జరిగిన తొలి టెస్టులో 29, 0 పరుగులు చేశాడు. దీంతో రెండో టెస్టుకు గంభీర్‌ను బెంచికే పరిమితం చేసి అతడి స్ధానంలో గాయం నుంచి కోలుకుని, రంజీ మ్యాచ్‌ ఆడుతున్న రాహుల్‌కు చోటు కల్పించారు.

ఇక మూడు టెస్టుల కోసం మంగళవారం ప్రకటించిన జట్టులో గంభీర్‌ను సిరిస్ నుంచే తప్పించారు. సరిగ్గా 2014లో కూడా ఇలానే జరిగింది. దీనంతటిని చూస్తుంటే గంభీర్ కెరీర్‌ ముగిసినట్లేనని అనిపిస్తోంది. ఇప్పటి వరకూ తన కెరీర్ లో 58 టెస్టులాడిన గంభీర్ 2007లో జరిగిన ట్వంటీ-20 ప్రపంచ కప్ టోర్నీలో కీలక పాత్ర పోషించాడు.

2011లో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన గంభీర్‌ను సెలెక్టర్లు ముఖం చాటేయడాన్ని చూస్తుంటే అతని కెరీర్‌కు తెర పడినట్టే కనిపిస్తోంది. 58 టెస్టులాడిన గంభీర్ మొత్తం 4,154 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 22 అర్ధ సెంచరీలు ఉన్నాయ. టెస్టుల్లో గంభీర్ అత్యధిక స్కోరు 206 పరుగులు.

గంభీర్‌ వేటుపై అయాజ్ మీమన్

ప్రస్తుతం భారత జట్టులో చోటు దక్కించుకోవడం చాలా కష్టంగా ఉంది. గంభీర్ గురించి బాధపడాల్సిన సందర్భం వచ్చింది.

బిలాల్

గంభీర్ పట్ల బీసీసీఐ చాలా కఠినంగా ప్రవర్తించింది.

డియర్ జిందగీ

ఇంగ్లాండ్‌తో జరగనున్న మిగతా మూడు టెస్టుల నుంచి గంభీర్‌ను తప్పించడాన్ని అభిమానులు సహించడం లేదు.

షారూక్ అభిమాని

లాల్... గంభీర్‌ని తప్పించి అతడి స్ధానంలో కేఎల్ రాహుల్‌ని జట్టులోకి తీసుకున్నారు. బీసీసీఐ నిర్ణయం భలేగా ఉందంటూ వెటకారంగా ట్వీట్ చేశాడు.

రోహన్ సేన్ గుప్తా

కేవలం రెండు మ్యాచ్‌ల్లో ఆడించి గంభీర్ విఫలమయ్యాడంటూ తప్పించడం సరైన నిర్ణయం కాదు.

అనిల్

బీసీసీఐ మంగళవారం 16 మందితో ప్రకటించిన జట్టులో గంభీర్ ను తప్పించారు. నిజంగా ఇది కోహ్లీ పిచ్చితనాన్ని తెలియజేస్తుంది. గంభీర్ స్ధానంలో వచ్చిన కేఎల్ రాహుల్ కూడా రాణించడం లేదు కదా? అని ప్రశ్నిస్తున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+