Gautam Gambhir: కోహ్లీ చెత్త కెప్టెన్సీనే ఆర్‌సీబీ ఓటమికి కారణం! ఆ ఓవర్ అతనికి ఇవ్వకుంటే..

IPL 2021 :‘One Of The Worst Overs I Have Seen’– Gautam Gambhir On Kohli’s Captaincy| Oneindia Telugu

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021 సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఓటమికి ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీనే కారణమని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ విమర్శించాడు. అనాలోచిత నిర్ణయాలతో కోహ్లీ మూల్యం చెల్లించుకున్నాడని అభిప్రాయపడ్డాడు. కోల్‌కతా‌నైట్‌రైడర్స్‌తో సోమవారం జరిగిన ఈ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే ఈఎస్‌పీఎన్‌క్రిక్ఇన్‌ఫోతో మాట్లాడుతూ ఈ మ్యాచ్ ఫలితాన్ని విశ్లేషించిన గంభీర్.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీని తప్పుబట్టాడు. ధారళంగా పరుగిలిచ్చుకున్న డానియల్ క్రిస్టియన్‌తో ఆ ఓవర్ వేయించాల్సింది కాదని అభిప్రాయపడ్డాడు.

 ఇదో చెత్త ఓవర్..

ఇదో చెత్త ఓవర్..

‘ఐపీఎల్‌లో నేను చూసిన చెత్త ఓవర్లలో ఇదొకటి. నేను చాలా చెత్త ఓవర్లు చూశాను. కానీ సునీల్ నరైన్‌ ఇలా చితక్కొడుతాడని ఊహించలేదు. పైగా ఎంతో టీ20 క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న డానియల్ క్రిస్టియన్ ఇంతలా పరుగులు ఇస్తాడనుకోలేదు. ఒకే ఓవర్‌లో 22 పరుగులు ఇవ్వడంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. నరైన్ బలం లెగ్ సైడ్ కావడంతో క్రిస్టియన్ ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ వేస్తారని అంతా అనుకున్నారు. కానీ నరైన్ అద్భుతంగా ఆడాడు. అనుభవంతో ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్‌ను బౌండరీలుగా మల్చాడు.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

కెప్టెన్‌గా కోహ్లీ ఘోర తప్పిదం..

కెప్టెన్‌గా కోహ్లీ ఘోర తప్పిదం..

అయితే ఇక్కడ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఘోర తప్పిదం చేశాడని గంభీర్ అభిప్రాయపడ్డాడు. అతను క్రిస్టియన్‌తో వేయించకుండా వికెట్ తీసే సామర్థ్యం కలిగిన బౌలర్‌ను బరిలోకి తీసుకు రావాల్సిందన్నాడు. యుజ్వేంద్ర చాహల్, మహమ్మద్ సిరాజ్.. ఇద్దరిలో ఎవరూ వేసినా.. సునీల్ నరైన్‌ను ఔట్ చేసినా కేకేఆర్ తీవ్ర ఒత్తిడికి గురయ్యేదన్నాడు. ‘కోహ్లీ చెత్త కెప్టెన్సీ ఆర్‌సీబీ కొంపముంచింది. క్రిస్టియన్ వేసిన ఓవర్‌కు ముందే హర్షల్ పటేల్ క్రీజులో సెట్ అయిన వెంకటేశ్ అయ్యర్‌ను ఔట్ చేశాడు. ఆ వెంటనే వికెట్ టేకర్ అయిన బౌలర్‌ను కోహ్లీ రంగంలోకి దింపాల్సింది. యుజ్వేంద్ర చాహల్ లేదా మహమ్మద్ సిరాజ్‌తో వేయించాల్సింది. క్రిస్టియన్ ఎప్పుడూ వికెట్ టేకింగ్ ఆప్షన్ కాదు. నరైన్ గనుక ఆ ఓవర్‌లో ఔటయ్యుంటే కేకేఆర్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొనేది.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

 మ్యాచ్ టర్నింగ్ పాయింట్..

మ్యాచ్ టర్నింగ్ పాయింట్..

బ్యాటింగ్‌లో కోలుకోలేని దెబ్బతీసిన నరైన్‌.. బౌలింగ్‌లోనూ మళ్లీ కొరకరానికొయ్యగా మారాడు. క్రిస్టియన్‌ వేసిన 12వ ఓవర్లో 3 సిక్స్‌లతో 22 పరుగులు రాబట్టుకోవడంతోనే బెంగళూరు ఆశలు ఆవిరయ్యాయి. దాంతో కోల్‌కతా విజయసమీకరణం సులువవ్వడంతో పాటు ఒత్తిడిలేకుండా పోయింది. అయితే ఆఖరి 18 బంతుల్లో 15 పరుగుల విజయ సమీకరణం కోల్‌కతాను సులువుగా ఊరిస్తుండగా... 18వ ఓవర్‌ వేసిన సిరాజ్‌ ఆశలు రేపాడు. 3 పరుగులే ఇచ్చి నరైన్, దినేశ్‌ కార్తీక్‌ (10)లను ఔట్‌ చేశాడు. 19వ ఓవర్లో గార్టన్‌ 5 పరుగులిచ్చాడు. ఆఖరి ఓవర్లో కోల్‌కతా 7 పరుగులు చేయాల్సిన దశలో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. కానీ క్రిస్టియాన్‌ తొలి బంతికే షకీబ్‌ బౌండరీ బాదడం... ఆ తర్వాత మూడు బంతులకు మూడు సింగిల్స్‌ రావడంతో కోల్‌కతా మరో 2 బంతులుండగానే విజయం సాధించింది.

నరైన్‌ ఆల్‌రౌండ్‌ షో

నరైన్‌ ఆల్‌రౌండ్‌ షో

ఇక ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 రన్స్ చేసింది. సునీల్ నరైన్(4/21) నాలుగు వికెట్లతో ఆర్‌సీబీ పతనాన్ని శాసించాడు. కేఎస్ భరత్(16 బంతుల్లో 9), విరాట్ కోహ్లీ(33 బంతుల్లో 39), ఏబీ డివిలియర్స్(9 బంతుల్లో 11), గ్లేన్ మ్యాక్స్‌వెల్‌(18 బంతుల్లో 15)ను పెవిలియన్ చేర్చి కోలుకోలేని దెబ్బతీశాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన కోల్‌కతా 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 139 పరుగులు చేసి రెండు బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. సునీల్ నరైన్(15 బంతుల్లో 3 సిక్సర్లతో 26) ధనాధన్ ఇన్నింగ్స్‌తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. శుభ్‌మన్ గిల్(18 బంతుల్లో 29), వెంకటేశ్ అయ్యర్(30 బంతుల్లో 26) రాణించారు. ఆర్‌సీబీ బౌలర్లలో చాహల్, సిరాజ్, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు తీశారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, October 12, 2021, 13:39 [IST]
Other articles published on Oct 12, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X