Gautam Gambhir: ఆ 175 రన్స్ అద్భుతం ఏమి కాదు జడేజా.. దమ్ముంటే అక్కడ 40 రన్స్ చేయి చాలు!

మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగిన రవీంద్ర జడేజాపై టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 175 పరుగులు చేసిన జడేజా, రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. దీంతో రవీంద్ర జడేజాపై అంతటా ప్రశంసలు కురుస్తున్న సమయంలో జడ్డు ఆడిన ఈ 175 పరుగుల ఇన్నింగ్స్ అంత గొప్పదేమి కాదు అంటూ గౌతం గంభీర్ బాంబు పేల్చాడు.

అద్భుతమైన ఇన్నింగ్స్ కాదు
శ్రీలంకతో తొలి టెస్టు మ్యాచ్‌లో రవీంద్ర జడేజా ఆడిన 175 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఏమీ అంత అద్భుతమైనది కాదని గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. కేవలం గణాంకాల పరంగానే జడేజా ఇన్నింగ్స్‌ను అందరూ అత్తుతమమైనదిగా భావిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చాడు. ఇదే ఇన్నింగ్స్‌ను విదేశాల్లో ఆడి ఉంటే మరింత ఆత్మవిశ్వాసం పెరిగేదని అన్నాడు. సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత డిసిల్వా, అసలంక, ఎంబూల్దేనియా బౌలింగ్‌లో జడేజా మరింత చెలరేగి ఆడాడని చెప్పాడు.

అక్కడ ఓ 40, 50 పరుగులు చేయి
ఆస్ట్రేలియా కానీ, ఇంగ్లండ్‌లో కానీ రవీంద్ర జడేజా ఏడో స్థానంలో వచ్చి ఓ 40, 50 పరుగులు చేసిన అది దీనికన్నా అత్యుత్తమ ఇన్నింగ్స్‌గా చెప్పవచ్చని గంభీర్ పేర్కొన్నాడు. అయితే రవీంద్ర జడేజా అత్యుత్తమ ఆల్‌రౌండర్ అనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదని అన్నాడు. టీ20ల్లో బౌలర్‌గా వికెట్లు తీయడంతోపాటు, బ్యాటర్‌గా హిట్టింగ్ కూడా చేయగలడని కొనియాడాడు. కానీ శ్రీలంకపై ఆడిన ఈ ఇన్నింగ్స్ మాత్రం అత్యుత్తమైనది కాదని గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు.

తొలి టెస్టులో ఘనవిజయం
కాగా మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో పూర్తి అధిపత్యాన్ని కనబరిచిన టీమిండియా ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. బ్యాటింగ్‌లో అజేయంగా 175 పరుగులు చేయడంతోపాటు బౌలింగ్‌లో 9 వికెట్లు తీశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన జడ్డూ, సెకండ్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీశాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు జడేజాకే దక్కింది. కాగా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో టీమిండియా 574-8 వద్ద డిక్లేర్ చేసింది. ఇక శ్రీలంక విషయానికొస్తే ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 174, సెకండ్ ఇన్నింగ్స్‌లో 178 పరుగులు మాత్రమే చేసింది.

రెండో టెస్ట్‌కు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), ప్రియాంక్ పంచల్, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, సౌరభ్ కుమార్, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications