Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గంభీర్ సార్ మంత్రం: టీమిండియాకు శాపం!

గౌతమ్ గంభీర్ సారథ్యంలో భారత జట్టు టెస్ట్ క్రికెట్ తర్వాక టీ20 క్రికెట్లోనూ ఘోర పరాజయాలను చవిచూసింది. ఆయన కోచింగ్ లో టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లతో జరిగిన టెస్ట్ సిరీస్‌లలో వైట్‌వాష్‌కు గురైంది. ఇప్పుడు టెస్ట్ సిరీస్‌ల తర్వాత టీ20 క్రికెట్లో కూడా భారత జట్టు అకస్మాత్తుగా గాడి తప్పింది. యూరోపియన్ పర్యటనలో ఐర్లాండ్, ఇంగ్లాండ్ జట్లపై టీమిండియా దారుణంగా ఓడింది. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-0తో గెలిచి ఇంగ్లాండ్ సంచలనం సృష్టించింది. ఈ సిరీస్‌లోని ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. లేకపోతే పరిస్థితి 5-0గా ఉండేది. ఇంగ్లండ్ కంటే ముందు ఐర్లాండ్ పర్యటనలో టీమిండియా 0-2తో వైట్‌వాష్‌‌కు గురైంది. యూరప్ పర్యటనలో భారత జట్టు ఆడిన 7 టీ20 మ్యాచ్‌లలోనూ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచాడు. కానీ కొత్త కెప్టెన్ సారథ్యంలో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది.

టీమిండియాకు ఈ ఓటమి కేవలం ట్రోఫీని కోల్పోవడానికే పరిమితం కాలేదు. ఇంగ్లాండ్ జట్టు భారత్ చేతిలో నుంచి టీ20 క్రికెట్ ఆధిపత్యాన్ని కూడా లాగేసుకుంది. 1605 రోజుల తర్వాత అంటే దాదాపు నాలుగున్నరేళ్ల తర్వాత ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా నంబర్ వన్ స్థానం నుంచి పడిపోయింది. ఈ సిరీస్ ప్రారంభానకి ముందు ప్రపంచంలో నంబర్ వన్ జట్టుగా ఉన్న భారత్.. వరుస పరాజయాలతో పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. చివరి మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు గెలిచి టీ20 కెరీల్లో నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకుంది.

Gautam Gambhir Coach Mantra Curse for Team India Historic 0-4 T20I Series Defeat against England

శనివారం(జులై 11) సౌతాంప్టన్‌లో జరిగిన చివరి టీ20 భారత జట్టు కష్టాలను పూర్తిగా బయటపెట్టింది. ప్రారంభ మ్యాచ్‌లలో సిరీస్ ఓటమికి బ్యాటర్లే ప్రధాన కారణమని భావించారు. భారత పిచ్‌లపైనా, ఐపీఎల్‌లోనూ బౌలర్లను చితకబాదిన బ్యాటర్లు.. ఇంగ్లాండ్‌లోని బౌన్సీ పరిస్థితులలో పరుగులు చేయడానికి తడబడ్డారు. చివరి మ్యాచ్‌లో జట్టు సమస్యలను మరింత తీవ్రతరం చేసింది బ్యాటర్లు కాదు.. బౌలర్లు, ఫీల్డర్లే.

బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. అన్నీ విఫలం
జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్‌లు భారత బౌలింగ్ దళాన్ని చిన్నాభిన్నం చేశారు. వారు రెండో వికెట్‌కు 233 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, భారత్‌ను మ్యాచ్ నుంచి తొలగించారు. ఈ జోడీని ఆపడానికి భారత బౌలర్ల వద్ద ఏ ప్లాన్ లేనట్లు కనిపించింది. బౌలింగ్ విఫలమైన దాన్ని పేలవమైన ఫీల్డింగ్ భర్తీ చేసింది. ప్రపంచ నంబర్ 1 జట్టు నుంచి జారవిడిచిన క్యాచ్‌లు, ఫీల్డింగ్‌లో చేసిన పొరపాట్లు అస్సలు ఊహించనివి. ఐదో టీ20 మ్యాచ్ ను ఇంగ్లాండ్ జట్టు కీలకంగా భావించింది. ఆతిథ్య జట్టు భారత్‌ను 4-0తో ఓడించడమే కాకుండా.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంపై కూడా దృష్టి సారించింది. ఇంగ్లాండ్ ఈ రెండు లక్ష్యాలను సాధించి.. వరుసగా రెండు టీ20 ప్రపంచకప్‌లు గెలిచిన భారత జట్టు ఆధిపత్యానికి ముగింపు పలికింది.

ఏదైమైనా తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడం చాలా అవసరం. ఇప్పుడు గౌతమ్ గంభీర్, జట్టు యాజమాన్యంపై ఇప్పుడు అదే ప్రశ్న తలెత్తుతోంది. ఇంగ్లాండ్ కు ముందు ఐర్లాండ్ భారత్‌ను 2-0 తేడాతో క్లీన్ క్వీప్ చేసింది. ఇది టీమిండియా క్రికెట్ చరిత్రలో ఓ పెద్ద ఎదురుదెబ్బ. ఐర్లాండ్ జట్టుతో ఓటమి తర్వాత జట్టు తమ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటుందని ఆశించారు. కానీ ఇంగ్లాండ్ జట్టుకో కథ మరింత దారుణంగా మారింది.

సూర్య స్థానంలో శ్రేయస్ అయ్యర్
2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ గెలిచినప్పటికీ, సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడం భారత క్రికెట్‌కు ఓ కీలక నిర్ణయం. సూర్యకుమార్ యాదవ్ పేలవమైన బ్యాటింగ్ ఫామ్ కారణంగా, అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను నియమించారు. ఐపీఎల్‌లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ, బ్యాటింగ్ ప్రదర్శన ఆధారంగా సెలెక్టర్లు అతనిపై విశ్వాసం వ్యక్తం చేశారు.యూరోపియన్ పర్యటనలో శ్రేయస్ అయ్యర్ యువత, అనుభవజ్ఞుల చక్కని కలయిక ఉన్న జట్టు బాధ్యతలను స్వీకరించాడు. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా వంటి స్టార్లు లేనప్పటికీ.. ఆ జట్టులో ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్‌లో తమను తాము నిరూపించుకున్న పలువురు ఆటగాళ్లు ఉన్నారు. అయినప్పటికీ గౌతమ్ గంభీర్, శ్రేయస్ అయ్యర్ అనే కొత్త ద్వయానికి తొలి బాధ్యత ఓ పీడకల కంటే తక్కువ కాదు.

ఈ పరివర్తన అనే సాకు ఇంకెంతకాలం నిలుస్తుంది?
ఐర్లాండ్‌పై 0-2 తేడాతో, ఇంగ్లాండ్‌పై 0-4 తేడాతో పరాజయాలు భారత టీ20 జట్టు అసలు స్వరూపాన్ని బట్టబయలు చేశాయి. గౌతమ్ గంభీర్ ఈ పేలవ ప్రదర్శనకు మార్పు దశ లేదా పరివర్తన కారణమని చెప్పవచ్చు, కానీ ఈ ఒక్క వాదనతో వరుస ఓటములను కొట్టిపారేయలేం. ఇంగ్లాండ్ పర్యటన మరో ప్రధాన బలహీనతను బయటపెట్టింది. స్వదేశీ పిచ్‌లపైనా, ఐపీఎల్‌లోనూ భారత బ్యాటర్లు అనుసరించిన దూకుడు వైఖరి విదేశీ పరిస్థితులలో ఫలించలేదు. బంతి బౌన్స్, కదలికల కారణంగా బ్యాటర్ల టెక్నిక్, పరిస్థితులకు అనుగుణంగా మారే సామర్థ్యం పరిశీలనకు గురయ్యాయి. ఐపీఎల్‌లోని 'ఇంపాక్ట్ ప్లేయర్' నిబంధన బ్యాటర్లకు అదనపు స్వేచ్ఛను ఇస్తుంది. కానీ అంతర్జాతీయ క్రికెట్‌లో అలాంటి రక్షణ ఏదీ లేదు. బ్యాటర్లు మారుతున్న పరిస్థితులను, బలమైన బౌలింగ్ దాడులను, మ్యాచ్ ఒత్తిడిని సొంతంగా ఎదుర్కోవాలి. ఇంగ్లాండ్‌లో జరిగిన ఈ పరీక్షలో భారత జట్టు పూర్తిగా విఫలమైంది.

గౌతమ్ గంభీర్ ఇంకెంతకాలం కొనసాగుతారు?
గౌతమ్ గంభీర్ కోచింగ్‌లోనే 2014లో స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు 0-3 తేడాతో వైట్‌వాష్‌కు గురైంది. ఆ తర్వాత, గతేడాది స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో దక్షిణాఫ్రికా భారత్‌ను 2-0 తేడాతో ఓడించింది. అంటే గౌతమ్ గంభీర్ సారథ్యంలో టెస్ట్ క్రికెట్‌లో భారత జట్టు రెండుసార్లు క్లీన్ స్వీప్ అవమానాన్ని చవిచూసింది. ఇప్పుడు టీ20 క్రికెట్‌లో కూడా టీమిండియా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది, కాబట్టి హెడ్ కోచ్‌పై ప్రశ్నలు తలెత్తడం ఖాయం.

వరుసగా రెండు టీ20 ప్రపంచ కప్‌లు గెలిచిన తర్వాత, టీమిండియా ప్రపంచంలోనే అత్యంత బలమైన జట్టుగా పరిగణించబడింది. ప్రతిభ పరంగా, భారత్ ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యుత్తమ జట్లలో ఒకటిగా ఉండవచ్చు, కానీ స్టేడియంలో ప్రదర్శనే అసలైన కొలమానం. ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లపై వరుసగా ఆరు పరాజయాలు టీమిండియాఆధిపత్యాన్ని మసకబార్చాయి. ఇప్పుడు ప్రశ్న కేవలం సిరీస్ ఓడిపోవడం గురించి మాత్రమే కాదు. టీమిండియా నిజంగా రూపాంతరం చెందుతోందా, లేక ఈ వరుస ఓటముల వెనుక ఇంకా లోతైన సమస్యలు దాగి ఉన్నాయా అన్నదే అసలు ప్రశ్న. గౌతమ్ గంభీర్, శ్రేయస్ అయ్యర్‌ల ముందు ఇప్పుడు జట్టును తిరిగి విజయాల బాట పట్టించడమే కాకుండా, గత కొన్ని వారాలుగా తీవ్రంగా దెబ్బతిన్న నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది.

Story first published: Sunday, July 12, 2026, 12:00 [IST]
Other articles published on Jul 12, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+