
ఆ రోజుల్లో డీఆర్‌ఎస్ ఉంటే:
గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ... 'డీఆర్‌ఎస్ టెక్నాలజీ అనిల్ కుంబ్లే ఆడే రోజుల్లో ఉండింటే అతను సులువుగా 900 వికెట్ల మైలురాయిని అందుకునేవారు. హర్భజన్ సింగ్ కూడా 700 వికెట్లు తీసేవాడు. ముఖ్యంగా ఎల్బీడబ్ల్యూ విషయంలో కొన్ని వికెట్లు కుంబ్లే, హర్భజన్‌లకు చేజారాయి. ఇద్దరు చాలా వికెట్లు నష్టపోయారు. కేప్‌టౌన్ లాంటి కఠినమైన పిచ్‌పై హర్భజన్ 7 వికెట్లు పడగొట్టగాడు. అదే టర్నింగ్ పిచ్‌లపై అయితే మరిన్ని వికెట్లు పడగొట్టేవాడు. ఒక్కసారి ఊహించుకోండి, ప్రత్యర్థి కనీసం 100 పరుగుల మార్క్‌ని కూడా అందుకునేది కాదేమో' అని అన్నాడు.

ఎనమిది సార్లు డకౌట్ అయినా పర్వాలేదు:
'2008 ఆస్ట్రేలియా టూర్ జరుగుతున్న సమయంలో నేను, వీరేందర్ సెహ్వాగ్ డిన్నర్ చేస్తున్నప్పుడు కుంబ్లే లోపలికి వచ్చి మీరు ఈ సిరీస్ ఓపెనింగ్ చేయండి అని చెప్పారు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్లో ఎనమిది సార్లు డకౌట్ అయినా పర్వాలేదు అని కూడా చెప్పారు. నా కెరీర్‌లో ఎవరి నుండి ఇలాంటి మాటలు ఎప్పుడూ వినలేదు. ఆ మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. నేను నా ప్రాణాన్ని ఒకరి కోసం ఇవ్వాల్సి వస్తే.. అది కచ్చితంగా అనిల్ కుంబ్లే గారే అవుతారు' అని గౌతమ్ గంభీర్ తెలిపాడు.

132 టెస్టులు.. 619 వికెట్లు:
1990లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన అనిల్ కుంబ్లే.. 132 టెస్టులాడి 619 వికెట్లు తీసారు. భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా జంబో నిలిచారు. 2008లో టెస్టులకి అనిల్ కుంబ్లే వీడ్కోలు పలకగా.. అదే ఏడాది టెస్టుల్లో డీఆర్‌ఎస్ టెక్నాలజీని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రవేశపెట్టింది. కుంబ్లే తర్వాత అత్యధిక టెస్టు వికెట్లు తీసిన భారత బౌలర్‌గా హర్భజన్ సింగ్ 417 వికెట్లతో ఉన్నాడు.

2008 వరకూ లేదు:
1992 నుంచే ఫీల్డ్ అంపైర్లకి ఏదైనా ఔట్‌పై సందేహం ఉన్నప్పుడు..థర్డ్ అంపైర్‌కి నివేదించే వెసులబాటు ఉంది. అప్పుడు థర్డ్ అంపైర్ డెసిషన్ చెప్తాడు. అయితే ఆటగాళ్లకి మాత్రం అంపైర్ల నిర్ణయాల్ని సమీక్షించమని కోరే సౌలభ్యం 2008 వరకూ లేదు. అంపైర్ల తప్పిదాలు ఎక్కువవడంతో తొలుత 2008లో టెస్టుల్లో డీఆర్‌ఎస్‌ని అమల్లోకి తెచ్చిన ఐసీసీ.. ఆ తర్వాత 2011 నుంచి వన్డేల్లో, 2017 నుంచి టీ20ల్లో ప్రవేశపెట్టింది.

రోహిత్ ఎదగడానికి కారణం ధోనీ:
వన్డే, టీ20 ఫార్మాట్‌లో ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఎదగడానికి కారణం అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోనీయే కారణం అని గంభీర్ అభిప్రాయపడ్డాడు. 'రోహిత్ ప్రతిభను గుర్తించిన ధోనీ 2013లో అతడిని మిడిలార్డర్ నుంచి ఓపెనర్‌గా పంపాడు. తొలుత విఫలమైనా అతడికి బాసటగా నిలిచి తెల్లబంతి క్రికెట్‌లో తిరుగులేని బ్యాట్స్‌మన్‌గా రోహిత్ పరిణతి సాధించడానికి ధోనీ దోహదపడ్డాడు' అని గంభీర్ చెప్పాడు.


Click it and Unblock the Notifications












