
హైదరాబాద్: రాబోయే సంవత్సరం ఐపీఎల్ సీజన్‌కు ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలైయ్యాయి. ప్రస్తుతమున్న కోచ్‌కు బదులుగా కొత్త కోచ్‌ను తీసుకునే దిశగా బెంగుళూరు రాయల్స్ ఏర్పాట్లు చేస్తుంది. ఈ క్రమంలో గతంలో ఢిల్లీ డేర్ డేవిల్స్ కోచ్ గా వ్యవహరించిన గ్యారీ కిర్‌స్టన్‌ను బెంగుళూరు రాయల్స్ జట్టుకు కోచ్‌గా నియమించింది.
రానున్న ఐపీఎల్-2018 సీజన్‌ను పురస్కరించుకొని బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ టీం కొత్త బ్యాటింగ్ కోచ్‌ను నియమించింది. దీనిపై ఇప్పటికే గ్యారీతో సంప్రదింపులు జరిపినట్లు నిర్వహకులు తెలిపారు. 2014, 2015 ఐపీఎల్ సీజన్లలో గ్యారీ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు కోచ్‌గా వ్యవహరించాడు.
ఈ రెండు సీజన్లలో ఢిల్లీ ప్రదర్శన ఏమాత్రం మెరుగ్గా లేదు. 2014లో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలవగా.. 2015లో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. కానీ, 2011లో టీమిండియాకు గ్యారీ కోచ్‌గా ఉన్న సమయంలోనే ధోనీ సేన ప్రపంచకప్‌ను గెలిచింది. ఈ ఏడాది బిగ్‌బాష్ లీగ్‌లో హోబర్ట్ హరికేన్స్ జట్టుకు గ్యారీ కోచ్ బాధ్యతలు నిర్వహించాడు.
గ్యారీని బ్యాటింగ్ కోచ్‌గా ఎంపిక చేసుకున్న దానిపై ఆర్‌సీబీ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. 2016లో రన్నరప్‌గా నిలిచిన ఆర్‌సీబీ 2017లో 14 లీగ్ మ్యాచుల్లో కేవలం మూడింట్లోనే విజయం సాధించింది. 2018 జనవరి 27,28తేదీల్లో నిర్వహించే వేలంతో ఆర్‌సీబీ జట్టు పూర్తి సభ్యుల ఖరారు కానున్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.