Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్: ఆర్‌సీబీ జట్టుకు కోచ్, మెంటార్‌గా గ్యారీ కిర్‌స్టన్

Gary Kirsten appointed Royal Challengers Bangalore coach and mentor

బెంగళూరు: ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) ఫ్రాంచైజీ తమ కోచ్‌గా గ్యారీ కిర్‌స్టెన్‌ను నియమించింది. ఈ మేరకు గురువారం ట్విట్టర్‌లో అధికారిక ప్రకటన చేసింది. ఇప్పటివరకు హెడ్‌ కోచ్‌గా వ్యవహరించిన కివీస్ మాజీ ఆటగాడు డానియెల్‌ వెటోరి స్థానంలో కిర్‌స్టెన్‌కు బాధ్యతలు అప్పగించారు.

దీంతో వెటోరితో ఆర్‌సీబీకి ఉన్న ఎనిమిదేళ్ల అనుబంధానికి తెరపడింది. ప్లేయర్‌గా 2014లో జట్టులోకి వచ్చిన వెటోరి ఆ తర్వాత అదే జట్టుకు హెడ్‌ కోచ్‌గా 2018 సీజన్‌ వరకు పని చేశారు. వెటోరి కోచ్‌గా ఉన్న సమయంలో ఆర్‌సీబీ పెద్దగా ప్రభావం చూపలేకపోగా, ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్‌‌ను సాధించలేకపోయింది.

"అతని భవిష్యత్ బాగుండాలని కోరుకుంటున్నాం. గ్యారీతో కలిసి పని చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బ్యాటింగ్ కోచ్‌గా కిర్‌స్టెన్ మెరుగైన పనితనాన్ని చూపెట్టాడు. అందుకే అతనికి ప్రమోషన్ కల్పించాం. మున్ముందు మంచి ఫలితాలను రాబట్టేందుకు కృషి చేస్తాం" అని ఆర్‌సీబీ చైర్మన్ సంజీవ్ చురివాలా తెలిపారు.

ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆర్‌సీబీ కిర్‌స్టెన్‌ను బ్యాటింగ్ కోచ్‌గా నియమించుకుంది. 2008 నుంచి 2011 వరకు టీమిండియాకు హెడ్ కోచ్‌గా పని చేసిన కిర్‌స్టెన్, భారత్ 2011 వన్డే వరల్డ్‌కప్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అత్యున్నత స్థాయిలో అతనికి 10 ఏళ్ల కోచింగ్ అనుభవం ఉంది.

ఆర్‌సీబీకి హెడ్ కోచ్, మెంటార్‌గా నియమింపబడిన తర్వాత కిర్‌స్టెన్ మాట్లాడుతూ వెటోరి నేతృత్వంలోని ఆర్‌సీబీ ఆటగాళ్లకు కోచింగ్ ఇవ్వడం చాలా సంతోషాన్నిచ్చిందని అన్నాడు.

Story first published: Friday, August 31, 2018, 12:01 [IST]
Other articles published on Aug 31, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+