For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ChampionsTrophy: 'చెప్పలేం.. అలా జరగొచ్చు!' - కోహ్లీ, రోహిత్, బుమ్రాపై దాదా

గత కొంత కాలంగా పరుగులు చేయలేక ఇబ్బంది పడుతోన్న స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫామ్ పై మాట్లాడాడు టీమిండియా మాజీ క్రికెటర్ గంగూలీ. త్వరలోనే జరగబోయే ఇంగ్లాండ్ వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ ఇద్దరు స్టార్స్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తారని ఆశించాడు.

"వైట్ బాల్ క్రికెట్ లో కోహ్లీ, రోహిత్ పెద్ద క్రికెటర్లు. టెస్ట్ క్రికెట్ తో పోలిస్తే ఈ ఫార్మాట్ లో వాళ్లకు మంచి రికార్డు ఉంది. ఇంగ్లాండ్ వన్డే సిరీస్ తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీలో వాళ్లు బాగా రాణిస్తారని ఆశిద్దాం. ముఖ్యంగా దుబాయ్ లో బాగా ఆడతారని భావిస్తున్నాను. గత వన్డే వరల్డ్ కప్ లో వీరిద్దరు బాగా రాణించారు." అని అన్నాడు.

Ganguly supports Virat Kohli Rohit Sharma makes strong comeback in Champions Trophy 2025 england ODI series

కాస్త ఆందోళన పెట్టే విషయమే
ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా పేరు ప్రకటించినప్పటికీ.. ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీ నాటికి బుమ్రా ఫిట్ నెస్ సాధించకపోతే పక్కన పెట్టేస్తామని బీసీసీఐ పేర్కొంది. దీంతో అతడు ఆడటం అనుమానంగా మారింది. దీనిపై దాదా మాట్లాడుతూ.. "బుమ్రా లాంటి ప్లేయర్ ఆడకపోవడం అనేది కాస్త ఆందోళన పెట్టే విషయమే. త్వరలోనే అతడు ఫిట్ నెస్ సాధించి టోర్నీ బరిలో దిగుతాడని ఆశిద్దాం." అని పేర్కొన్నాడు.

అలా జరగాలని ఆశిద్దాం
సర్జరీతో చాలా కాలం పాటు ఆటకు దూరమైన షమీ.. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్ లోకి అడుగుపెట్టిన అదిరే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అనంతరం రీసెంట్ గా జాతీయ జట్టులోనూ చోటు సంపాదించుకున్నాడు. కానీ ఒక్క మ్యాచ్ ఆడి.. అంతగా ఆకట్టుకోలేదు. దీనిపై గంభీర్ మాట్లాడుతూ.. "ఇప్పుడు అతడు ఫస్ట్ క్లాస్ క్రికెట్, డొమాస్టిక్ క్రికెట్ ఆడాడు. ఫిట్ నెస్ సాధించాడు. మంచి ప్రదర్శనతో ఇప్పటికే తానేంటో నిరూపించాడు. అతడికి రాబోయే సిరీస్ ల్లో అవకాశం దక్కాలని ఆశిద్దాం. అవకాశం వస్తే అతడు బాగా ఆడతాడని అనుకుంటున్నాను." అని వెల్లడించాడు.

గత కొద్ది కాలంగా కోహ్లీ, రోహిత్ మాత్రమే కాదు టీమిండియా టెస్ట్ క్రికెట్ టీమ్ సరైన ప్రదర్శన చేయట్లేదు. రీసెంట్ గా జరిగిన న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై ఓటమి చెందింది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇంగ్లాండ్ పర్యటనలో టెస్ట్ క్రికెట్ ఆడనుంది. దీనిపై గంగూలీ మాట్లాడుతూ.. "ఈ సిరీస్ లో జట్టులో ఎవరుంటే బాగుంటుందో అని తన అభిప్రాయాన్ని చెప్పాడు దాదా. బ్యాటింగ్ బాగా ఆడి స్కోర్ చేయాలి.యంగ్ స్టర్స్ జైశ్వాల్ ఆస్ట్రేలియాపై బానే ఆడాడు. నితీశ్ కూడా ఒకటి రెండు మ్యాచులు బాగానే ప్రదర్శన చేశాడు. వాళ్లుంటే బానే ఉంటుంది. అన్నింటికీ కన్నా ముందు బుమ్రా ఫిట్ నెస్ సాధించాలని ఆశిద్దాం." అని చెప్పుకొచ్చాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ కు చేరే జట్లపై అంచనా వేస్తూ.. "భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా బలంగా ఉన్నాయి. వెస్టిండీస్ కూడా ఛాంపియన్ టీమ్. పైగా పాకిస్థాన్ హోం గ్రౌండ్ లో ఆడుతోంది. చెప్పలేం ఏ టీమ్ అయినా వెళ్లొచ్చు." అని దాదా అన్నాడు.

Story first published: Sunday, February 2, 2025, 19:27 [IST]
Other articles published on Feb 2, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+