'గంగూలీ ఆల్ టైమ్ ఎలెవన్ టీమ్' : ఆ ఇద్దరు లెజెండ్స్ మిస్
బెంగుళూరు : అంతర్జాతీయ క్రికెట్ లో సుదీర్ఘ కాలం కెరీర్ ను కొనసాగించిన పలువురు క్రికెటర్లు.. తమకు 'ది బెస్ట్' అనిపించిన క్రికెటర్ల జాబితాతో ఆల్ టైమ్ ఎలెవన్ జట్లను ప్రకటించడం క్రికెట్ సాంప్రదాయాల్లో ఎప్పటినుంచో కొనసాగుతోంది.
మొన్నీమధ్యే కుమార సంగక్కర, బ్రెండన్ మెక్ కల్లమ్ లాంటి మాజీ క్రికెటర్లు తమ ఆల్ టైమ్ ఎలెవన్ జాబితా ప్రకటించగా.. తాజాగా టీమ్ ఇండియా లెజండరీ క్రికెటర్లలో ఒకరైన గంగూలీ కూడా ఈ జాబితాలో చేరాడు. గురువారం నాడు లార్డ్స్ మైదానానికి సంబంధించిన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఆల్ టైమ్ ఎల్ వన్ జాబితాతో కూడిన ఓ వీడియోను పోస్ట్ చేశాడు గంగూలి.
ఇండియా నుంచి లెజండరీ క్రికెటర్లు.. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ లకు ఈ జాబితాలో స్థానం కల్పించిన గంగూలీ, విండీస్ క్రికెట్ లెజెండ్స్ 'వివి రిచర్డ్స్, లారా' లకు స్థానం కల్పించకపోవడం గమనార్హం. ఆల్ టైమ్ ఎలెవన్ లో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ కు, ఇంగ్లాండ్ కెప్టెన్ కు అలిస్టర్ కుక్ కు ఓపెనర్లుగా స్థానం కల్పించాడు గంగూలీ.

ఆ తర్వాతి మూడు నాలుగు స్థానాల్లో ద్రావిడ్, సచిన్ ల పేర్లను పేర్కొన్న గంగూలీ.. టీమ్ కు కెప్టెన్ గా రికీ పాంటింగ్ ను ఎన్నుకోవడం విశేషం. ఇక బౌలింగ్ విభాగంలో స్పిన్నర్లుగా లెజండరీ స్పిన్నర్లు షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్ లకు చోటు కల్పించిన గంగూలీ.. పేసర్లుగా మెక్ గ్రాత్ (ఆస్ట్రేలియా) డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా) లకు స్థానం కల్పించాడు. ఆల్ రౌండర్ స్థానాన్ని జాక్వెస్ కల్లిస్ కు కట్టబెట్టాడు గంగూలీ.
ప్రస్తుత కోచ్ టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లేకు కూడా ఆల్ టైమ్ ఎలెవన్ జాబితాలో గంగూలీ స్థానం కల్పించకపోవడం గమనార్హం.
గంగూలీ ఆల్ టైమ్ ఎలెవన్ టీమ్ జాబితా :
1) మాథ్యూ హెడెన్ (ఆస్ట్రేలియా)
2)అలిస్టర్ కుక్ (ఇంగ్లాండ్)
3)రాహుల్ ద్రావిడ్ (ఇండియా)
4)సచిన్ టెండూల్కర్ (ఇండియా)
5)జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా)
6)కుమార సంగక్కర (శ్రీలంక)
7)రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)
8)గ్లెన్ మెక్ గ్రాత్ (ఆస్ట్రేలియా)
9)డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా)
10) షేన్ వార్న్ (ఆస్ట్రేలియా)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications