శాస్త్రిని కలిసిన తర్వాతే ద్రవిడ్ ఆ పని చేశాడు: ఏం జరిగిందో తెలీదన్న గంగూలీ

హైదరాబాద్: ఇంగ్లీషు గడ్డపై టెస్టు సిరీస్‌ను 1-3తో టీమిండియా చేజార్చుకున్న నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రిపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తీవ్ర విమర్శలు కురిపిస్తున్నాడు. ఈ సిరీస్ ఓటమికి రవిశాస్త్రినే పూర్తి బాధ్యత వహించాలంటూ విమర్శలు గుప్పించిన గంగూలీ తాజాగా ఓ కొత్త విషయాన్ని తెరపైకి తీసుకొచ్చాడు.

హెడ్ కోచ్‌గా రవిశాస్త్రిని ఎంపిక చేసినప్పుడే
టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రిని ఎంపిక చేసినప్పుడే రాహుల్ ద్రవిడ్‌ను విదేశాల్లో టీమిండియా బ్యాటింగ్ సలహాదారుగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ రాహుల ద్రవిడ్ ఈ పదవి చేపట్టలేదు. దాని గురించి గంగూలీ ఇప్పుడు వెల్లడించాడు.

ద్రవిడ్ అందుకు అంగీకరించాడు
"టీమిండియా రవిశాస్త్రిని కోచ్‌గా ఎంపిక చేసినప్పుడు విదేశాల్లో బ్యాటింగ్ సలహాదారుగా ఉండాలని ద్రవిడ్‌ను అడిగాం. అందుకు అతను అంగీకరించాడు. రవిశాస్త్రితో రాహుల్ మాట్లాడిన తర్వాత ఏం జరిగిందో తెలియదు. కోచ్ ఎంపిక సమయంలో క్రికెట్ పాలకుల కమిటీ సైతం గందరగోళానికి తెరతీసింది" అని అన్నాడు.

ద్రవిడ్ ఎందుకు బ్యాటింగ్ సలహాదారు కాలేదంటే చెప్పడం కష్టం
"ఆ తర్వాత మేం ఆ తర్వాత దాని సంగతి వదిలేశాం. అందుకే ద్రవిడ్ ఎందుకు బ్యాటింగ్ సలహాదారు కాలేదంటే చెప్పడం నాకు కష్టం. అయితే విరాట్ కోహ్లీని సంప్రదించిన తర్వాత రవిశాస్త్రి ఆ బాధ్యత తీసుకుంటే అతడు వందశాతం ఆ పనిచేసి తీరాలి. జట్టు ప్రదర్శన మెరుగయ్యేందుకు బాధ్యత వహించాలి. జట్టు ప్రదర్శన మెరుగయ్యేందుకు బాధ్యత వహించాలి" అని గంగూలీ అన్నాడు.

1-3తో టెస్టు సిరిస్‌ను చేజార్చుకున్న కోహ్లీసేన
ప్రస్తుతం కోహ్లీసేన సుదీర్ఘ పర్యటనలో భాగంగా ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 1-3తో చేజార్చుకుంది. ఈ పర్యటనలో కోహ్లీ మినహా పెద్దగా ఎవరూ రాణించలేకపోయారు. ఈ సిరిస్‌లో చివరిదైన ఐదో టెస్టు ఓవల్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications