న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తూర్పు నుంచి పుట్టుకొచ్చిన గొప్ప క్రికెటర్‌ ధోని: గంగూలీ ప్రశంస

By Nageshwara Rao
Ganguly proud of Dhoni: Happy to see the rise of another player from east

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని చూస్తే తనకెంతో గర్వంగా ఉందని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. దేశంలోని తూర్పు ప్రాంతాల నుంచి ఆటగాళ్లే చాలా తక్కువగా ఉంటారని, అలాంటి సమయంలో పుట్టుకొచ్చిన గొప్ప క్రికెటర్‌ ధోని అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు.

తూర్పు ప్రాంతం (పశ్చిమ బెంగాల్‌) నుంచి వచ్చిన తొలి కెప్టెన్‌ని తాను కాగా, రెండో​ క్రికెటర్‌ ధోని (జార్ఖండ్‌) అని గంగూలీ తెలిపాడు. ఆ ప్రాంతం అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లు ఎక్కవగా లేని సమయంలో జట్టులోకి వచ్చిన ధోని ఎన్నో అద్భుతాలు సాధించాడని గంగూలీ కొనియాడాడు.

 బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ అనే చాట్ షోలో గంగూలీ

బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ అనే చాట్ షోలో గంగూలీ

తాజాగా గంగూలీ బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ అనే చాట్ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ధోనిపై గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. గంగూలీ మాట్లాడుతూ "తొలుత తొలి టీ20 వరల్డ్‌కప్‌ను అందించిన ధోని కెప్టెన్సీలోనే భారత్‌ 2011 వన్డే వరల్డ్‌కప్‌తో పాటు 2013లో చాంపియన్స్‌ ట్రోఫిని ముద్దాడింది.​ నేను ఓవరాల్‌గా దాదాపు 450 మ్యాచ్‌లాడా" అని అన్నాడు.

500 అంతర్జాతీయ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ధోని

500 అంతర్జాతీయ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ధోని

"ధోని మాత్రం సుదీర్ఘ కెరీర్‌ను కొనసాగిస్తూ 500 అంతర్జాతీయ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. ధోని జట్టులోకి వచ్చిన కొత్తలో 2004లో పాకిస్తాన్‌తో విశాఖపట్నంలో జరిగిన వన్డేలో ప్రయోగం చేసి ఫలితం సాధించా. 7వ స్థానంలో రావాల్సిన ధోనిని 3వ స్థానం (వన్‌డౌన్‌)లో బ్యాటింగ్‌కు వెళ్లమన్నా" అని గంగూలీ పేర్కొన్నాడు.

 నేను 4వ స్థానంలో దిగుతా అని చెప్పా

నేను 4వ స్థానంలో దిగుతా అని చెప్పా

"షాకైన ధోని మరి నువ్వు అని అడిగితే.. నేను 4వ స్థానంలో దిగుతా అని చెప్పా. ఆమ్యాచ్‌లో ధోని అద్భుత ప్రదర్శన చేసి 148 పరుగులు సాధించాడు. నాణ్యమైన ఆటగాళ్లు ఇలాగే పుట్టుకొస్తారు" అని గంగూలీ వివరించాడు. తన కెప్టెన్సీలో విదేశాల్లో భారత క్రికెట్‌ జట్టు విజయాల బాట పట్టగా, ధోని కెప్టెన్‌ అయ్యాక పెద్ద పెద్ద జట్లపై కూడా సిరీస్‌లు గెలిచాడని అన్నాడు.

భారత టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలిసారి

భారత టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలిసారి

భారత టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ధోని నాయకత్వంలోని టీమిండియా తొలిసారిగా(2009లో) అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. మరోవైపు తన కెప్టెన్సీలో యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, మహ్మద్‌ కైఫ్‌, జహీర్‌ ఖాన్‌, ఆశిష్‌ నెహ్రా, ధోని లాంటి నాణ్యమైన క్రికెటర్లు జాతీయ జట్టులోకి వచ్చారని గంగూలీ గుర్తు చేసుకున్నారు.

Story first published: Sunday, July 29, 2018, 12:03 [IST]
Other articles published on Jul 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X