IPL 2023 : ఫ్యూచర్‌లో ఐపీఎల్ వీళ్లదే.. ఐదుగురు ప్లేయర్లను ఎంచుకున్న గంగూలీ!

ఐపీఎల్‌కు కౌంట్ డౌన్ బిగిన్ అయింది. మరో నెల రోజుల్లో ఈ మెగా టోర్నీ మొదలవనుంది. ఈ క్రమంలో టాటా ఐపీఎల్‌ను మరింత థ్రిల్లింగ్‌గా మార్చి, ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా చేయగలిగే కుర్రాళ్లు ఎవరనే ప్రశ్నకు బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్, టీమిండియా లెజెండరీ ప్లేయర్ సౌరవ్ గంగూలీ సమాధానం చెప్పాడు. ఈ ఐపీఎల్ మాత్రమే కాదు, భవిష్యత్తులో కూడా వీళ్లు ఐపీఎల్‌లో మరింత పెద్ద స్టార్లు అవుతారని గంగూలీ అభిప్రాయపడ్డాడు.

సూర్య టాప్‌లో ఉంటాడు..
గంగూలీ ఈ ఐదుగురు ఆటగాళ్ల పేర్లు చెప్తున్న వీడియోను స్టార్ స్పోర్ట్స్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది. 'ఇండియన్ ప్రీమియర్ లీగ్ కౌంట్ డౌన్ మొదలైంది. ఈ టోర్నీలో ఆడే తన ఫేవరెట్ యంగ్ ప్లేయర్లు ఎవరో సౌరవ్ గంగూలీ చెప్పాడు. వీళ్లు టాటా ఐపీఎల్‌ను మరింత గొప్పగా మారుస్తారని దాదా అన్నాడు. ఈ లిస్టులో సూర్యకుమార్ యాదవ్ టాప్ ప్లేస్‌లో ఉంటాడని దాదా అభిప్రాయపడ్డాడు. కానీ అతన్ని కుర్రాడి కింద పరిగణనలోకి తీసుకోవడం కరెక్ట్ కాదని తెలిపాడు.

గంగూలీ ఫేవరెట్స్..
'ఇక యంగ్ ప్లేయర్లలో చూసుకుంటే పృథ్వీ షా చాలా ట్యాలెంట్ ఉన్న ప్లేయర్. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో అతనో అద్భుతమైన ఆటగాడు. అలాగే రిషభ్ పంత్ కూడా. పంత్ వయసెంత? ఇప్పుడే ప్రపంచం అతని కాళ్ల దగ్గర ఉంది. అందుకే రిషభ్ పంత్ నెంబర్ టూ. అలాగే రుతురాజ్ గైక్వాడ్‌పై కూడా ఒక లుక్కేసి ఉంచుతా. అతను ఎలా ఆడతాడో గమనిస్తూ ఉండటం మంచిది. ఈ ముగ్గురు బ్యాటర్లను అందరూ గమనించాలి' అని దాదా చెప్పాడు. వీళ్లందరూ కూడా తమ టాప్ క్లాస్ ఆటతో పాపులర్ అయిన వాళ్లే కావడం గమనార్హం.

ఐపీఎల్‌లో టాప్ బ్యాటర్లు..
ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 63 మ్యాచులు ఆడిన పృథ్వీ షా.. 12 హాఫ్ సెంచరీలతో 1588 పరుగులు చేశాడు. గతేడాది ఐపీఎల్‌లో 10 మ్యాచుల్లో 283 పరుగులు చేశాడీ విధ్వంసకర ఓపెనర్. యాక్సిడెంట్ కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌లో పంత్ ఆడటం లేదన్న సంగతి తెలిసిందే. అతను గతేడాది 14 మ్యాచుల్లో 340 పరుగులు చేశాడు. అతను తన కెరీర్‌లో మొత్తం 98 ఐపీఎల్ మ్యాచుల్లో 2838 పరుగులు సాధించాడు. గైక్వాడ్ అయితే 2021లో ఆరెంజ్ క్యాక్ కూడా సాధించాడు. కెరీర్‌లో 36 ఐపీఎల్ మ్యాచులు ఆడిన అతను 1207 పరుగులు నమోదు చేశాడు. వీటిలో 10 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి.

ఉమ్రాన్ సూపర్ స్టార్..
ఇక బౌలర్ల విషయానికొస్తే సన్‌రైజర్స్ పేస్‌గుర్రం ఉమ్రాన్ మాలిక్ కూడా సూపర్ స్టార్ అవుతాడని గంగూలీ అభిప్రాయపడ్డాడు. అతను కనుక ఫిట్‌గా ఉంటే దుమ్ముదులుపుతాడని చెప్పాడు. అతని జెన్యూన్ పేస్ కోసమైనా అభిమానులు మాలిక్ ఆటను గమనిస్తూనే ఉంటారని తెలిపాడు. భవిష్యత్తులో ఉమ్రాన్ కచ్చితంగా బడా ప్లేయర్ అవుతాడని స్పష్టం చేశాడు. ఐపీఎల్‌లో నిలకడగా 150 కిలోమీటర్లపైగా వేగంతో బంతులు వేస్తూ అందరి దృష్టినీ ఉమ్రాన్ ఆకర్షించిన సంగతి తెలిసిందే.

గిల్‌ను మర్చిపోయా..
చివర్లో శుభ్‌మన్ గిల్‌కు కూడా ఐపీఎల్‌లో మంచి భవిష్యత్తు ఉంటుందని దాదా అభిప్రాయపడ్డాడు. ఈ పేరు తను మర్చిపోయానని నవ్వేశాడు. 'గిల్ పేరు మర్చిపోయా. నా ఐదో ప్లేయర్ గిల్. ఈ లిస్టులో సూర్య టాప్ ప్లేస్‌లో ఉంటాడు. కానీ అతన్ని కుర్రాళ్లలో కలపొద్దు. మిగతా వారిలో పృథ్వీ షా, రిషభ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్, ఉమ్రాన్ మాలిక్, శుభ్‌మన్ గిల్. ఈ ఐదుగురికీ ఐపీఎల్‌లో మంచి ఫ్యూచర్ ఉంది' అని గంగూలీ పేర్కొన్నాడు. గతేడాద గుజరాత్ టైటాన్స్ ఓపెనర్‌గా వచ్చిన గిల్ 16 మ్యాచుల్లో నాలుగు హాఫ్ సెంచరీలతో 483 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications