న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కావాలనే కుంబ్లేను పక్కనపెట్టేశా: గంగూలీ

Ganguly: 'Leaving out Kumble was the toughest decision as captain'

హైదరాబాద్: భారత జట్టుకు ఎన్నో విజయాలను తెచ్చిపెట్టిన బౌలర్ అనిల్ కుంబ్లే. అయితే అతన్ని సైతం పక్కన పెట్టేశాడట గంగూలీ. అతను రాస్తున్న ఆత్మకథ 'ఎ సెంచురీ ఈజ్ నాట్ ఎనఫ్ బుక్‌'‌లో ఈ విషయాన్ని బయటపెట్టాడు.

కెప్టెన్‌గా తాను తీసుకున్న నిర్ణయాల్లో ఇది ఒకటని తాజాగా ఓ ఇంటర్వ్యూలో దాదా తెలిపాడు. బుక్ ప్రమోషన్‌లో భాగంగా గంగూలీ ఓ ప్రైవేటు టీవీ ఛానెల్‌లో ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో కుంబ్లే గురించి ఇలా.. '2003 మార్చి 23న జొహాన్నెస్‌బర్గ్‌లో భారత్‌ ఆడిన మ్యాచ్‌ను ఎవరూ మర్చిపోలేరు. ఎందుకుంటే అది ప్రపంచకప్‌ ఫైనల్‌. జరిగింది భారత్‌-ఆస్ట్రేలియా మధ్య. ఈ మ్యాచ్‌ కోసం నేను చేసిన ఓ మార్పు చూసి అభిమానులు షాకయ్యారు. అదేంటంటే ఈ మెగా ఫైనల్‌ కోసం నేను అనిల్‌ కుంబ్లేకు తుది జట్టులో స్థానం కల్పించలేదు' అని పేర్కొన్నాడు.

ఇంకా మాట్లాడుతూ.. అతని స్థానంలో హర్భజన్‌ సింగ్‌ను జట్టులోకి తీసుకున్నాను. ఈ నిర్ణయం చాలా కఠినమైనది. కెప్టెన్‌గా నేను తీసుకున్న కఠిన నిర్ణయాల్లో ఇది ఒకటి. అతనో గొప్ప ఆటగాడు. తుది పదకొండులో అతను లేకుండా జట్టును ఎంపిక చేయడం చాలా కష్టం. అలాంటిది నేను ఫైనల్‌ కోసం కుంబ్లేను పక్కన పెట్టాల్సి వచ్చింది' అని గంగూలీ వివరించాడు.

ధోనీ గురించి ప్రస్తావిస్తూ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు స్పందించిన దాదా అతను ఒక మంచి ఆటగాడని పేర్నొన్నారు. అయితే గంగూలీ దృష్టిలో బెస్ట్ కెప్టెన్ ఎవరు అని అడిగిన ప్రశ్నకు ధోనీ, కోహ్లీల గురించి విశ్లేషించి చివర్లో స్టీవ్ వా అని తేల్చేశాడు.

Story first published: Friday, March 2, 2018, 16:51 [IST]
Other articles published on Mar 2, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X