For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్: గంగూలీ అరుదైన ఘనత

By Nageshwara Rao
Ganguly & Bishop among commentators for ICC U19 Cricket World Cup

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ ఆసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి అరుదైన ఘనత సాధించాడు. జనవరి 13 నుంచి న్యూజిలాండ్ వేదికగా జరిగే అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీలో కామెంటేటర్‌గా గంగూలీ బాధ్యతలు నిర్వహించనున్నాడు.

ఈ మేరకు గురువారం కామెంటేటర్‌ బాధ్యతలు నిర్వహించే వారి జాబితాను ఐసీసీ ప్రకటించింది. మొత్తం 14మందితో కూడిన జాబితాలో భారత్‌కు చెందిన మాజీ క్రికెటర్లు సౌరభ్‌ గంగూలీ, అంజుమ్‌ చోప్రాలకు చోటు దక్కింది. వీరితో పాటు ఆస్ట్రేలియా, శ్రీలంక తదితర దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు ఈ జాబితాలో ఉన్నారు.

ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ టోర్నీ కామెంటరీ ప్యానెల్‌లో చోటు దక్కించుకున్న క్రికెటర్లు:
* సౌరవ్ గంగూలీ(ఇండియా)
* అంజుమ్‌ చోప్రా(ఇండియా)
* టామ్‌ మూడీ (ఆస్ట్రేలియా)
* ఇయాన్‌ బిషప్‌(వెస్టిండీస్‌)
* సైమన్‌ డౌల్‌(న్యూజిలాండ్‌)
* డానీ మారిసన్‌(న్యూజిలాండ్‌)
*హెచ్‌డీ అకర్మన్‌(దక్షిణాఫ్రికా)
*రాబ్‌ కీ(ఇంగ్లాండ్‌)
* నిక్‌ నైట్‌(ఇంగ్లాండ్‌)
* మార్క్‌ బుచర్‌(ఇంగ్లాండ్‌)
* గ్రాంట్‌ ఇలియాట్‌(న్యూజిలాండ్‌)
* రసూల్‌ ఆర్నాల్డ్‌(శ్రీలంక)
* అలాన్‌ విలకిన్స్‌(ఇంగ్లాండ్‌)
* క్రిస్‌ హారిస్‌(న్యూజిలాండ్‌)

కాగా, అత్యంత ప్రతిష్టాత్మకమైన అండర్-19 వరల్డ్ కప్ టోర్నీ జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 3తో ముగియనుంది. ఇప్పటికే పృథ్వీ షా నేతృత్వంలోని టీమిండియా న్యూజిలాండ్‌కు చేరుకుంది. అంతేకాదు రెండు రోజుల క్రితం దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. భారత అండర్-19 జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఉన్న సంగతి తెలిసిందే.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, January 11, 2018, 15:12 [IST]
Other articles published on Jan 11, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+