న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్-పాక్‌ల మ్యాచ్ చూసేందుకు దావూద్ ఇబ్రహీం రానున్నాడట!!

 Gangsters close to Dawood to attend India-Pak Asia Cup match: Intelligence report

అబుదాబి: భారత్-పాక్‌ల మధ్య మ్యాచ్ అంటే ఇరు దేశాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్. ఈ క్రమంలో మ్యాచ్ జరగడానికి కొద్ది రోజుల ముందే స్టేడియంలోని టిక్కెట్లన్నీ అమ్ముడుపోతాయి. ఇది కేవలం సాధారణ క్రికెట్ అభిమానికే కాదు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కూడా ప్రత్యక్షంగా మ్యాచ్ చూసేందుకు వస్తున్నట్లు ప్రముఖ ఇంగ్లీషు మీడియా కథనాన్ని ప్రచురించింది.

దావూద్ వస్తున్నాడని ఆరు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు

దావూద్ వస్తున్నాడని ఆరు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు

ఆసియా కప్‌లో భాగంగా ఇండియా, పాకిస్థాన్ మధ్య జరగబోయే మ్యాచ్‌కు దావూద్ వస్తున్న విషయంపై ఆరు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు దృష్టిసారించాయి. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడటానికి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరులు, అతని కుటుంబ సభ్యులు వస్తున్నట్లు ఈ ఆరు ఏజెన్సీలు వెల్లడించడం గమనార్హం. ఇండోపాక్ మ్యాచ్ గురించి ఓ కీలక సమాచారం ఇంటెలిజెన్స్ గ్లోబల్ నెట్‌వర్క్‌కు అందింది.

ముంబై, కరాచీల నుంచి దుబాయ్‌కు

ముంబై, కరాచీల నుంచి దుబాయ్‌కు

దావూద్ సన్నిహితులైన ఇద్దరు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు ఈ మ్యాచ్ చూడటానికి వస్తున్నారని వాళ్లకు సమాచారం తెలిసింది. దావూద్ కుటుంబ సభ్యులు, బంధువులు ఇప్పటికే ముంబై, కరాచీల నుంచి మ్యాచ్ చూడటానికి దుబాయ్‌కు వచ్చారు. ఇదే అదనుగా సమాచారం తెలిసిన వెంటనే ఆరు దేశాలకు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అప్రమత్తమయ్యారు.

దావూద్‌ను పట్టుకోవాలనే ప్రయత్నంలో

దావూద్‌ను పట్టుకోవాలనే ప్రయత్నంలో

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌ను పట్టుకోవడంతోపాటు పాకిస్థాన్‌లో దావూద్ ఉన్న ప్రదేశం, అతనికి చెందిన కొత్త వ్యాపారాల గురించి తెలుసుకోవాలనే ప్రయత్నంలో ఏజెన్సీలు ప్రయత్నాలు ముమ్మరం చేయనున్నాయి. ఇండియాతోపాటు అమెరికా, యూకే, రష్యా, చైనాలకు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఈ మ్యాచ్‌ను నిశితంగా పరిశీలించనున్నాయి. ఈ మ్యాచ్ కోసం టికెట్ల రేట్లను కూడా భారీగా పెంచారు.

ఒక్క టికెట్ ధరను సుమారు రూ.1.15 లక్షలుగా

ఒక్క టికెట్ ధరను సుమారు రూ.1.15 లక్షలుగా

మైదానంలో ఉండే ప్రత్యేక అతిథుల గ్యాలరీలో ఒక్క టికెట్ ధరను సుమారు రూ.1.15 లక్షలుగా నిర్ణయించారు. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌లంటే దావూద్‌కు చాలా ఇష్టం. అతడు ఈ మ్యాచ్‌లను మిస్ అవకుండా చూడటంతోపాటు.. భారీగా బెట్టింగ్‌లకు కూడా పాల్పడతాడు. ఆసియాకప్‌లో భాగంగా మంగళవారం హాంకాంగ్‌తో తలపడనున్న భారత్ బుధవారం పాక్‌తో తలపడనుంది.

Story first published: Tuesday, September 18, 2018, 13:18 [IST]
Other articles published on Sep 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X