హైదరాబాద్: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఫిబ్రవరి 9 నుంచి హైదరాబాద్‌లో జరగాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్ నిర్వహణపై ఉన్న సందేహాలు తొలగిపోయాయి. బీసీసీఐ జనరల్ మేనేజర్ (క్రికెట్ డెవలప్‌మెంట్) రత్నాకర్ శెట్టి బుధవారం ఉప్పల్ స్టేడియాన్ని సందర్శించి తాజా పరిస్థితిని సమీక్షించారు.
మైదానంలో ఉన్న సౌకర్యాలతో పాటు అవుట్ ఫీల్డ్‌ను, పిచ్‌ను పరిశీలించారు. హెచ్‌సీఏ ప్రతినిధులతో మ్యాచ్ ఏర్పాట్లను సమీక్షించాడు. ఈ నేపథ్యంలో భారత్-బంగ్లా టెస్టును తాము సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్‌సీఏ స్పష్టం చేసింది.
మరోవైపు ప్రస్తుతం ఉన్న హెచ్‌సీఏ కార్యవర్గం మ్యాచ్ నిర్వహణ కోసం పూర్తిగా సహకరిస్తుందా? అని శెట్టి సూటిగా ప్రశ్నించినట్లు తెలిసింది. తమ నుంచి ఎలాంటి సమస్యరాదని హెచ్‌సీఏ సభ్యులు ఆయనకు వివరించారు. వాణిజ్య ప్రకటనల ద్వారా రూ 1.60 కోట్లు రావడంతో నిధులపరంగా కూడా సమస్య ఏమీ లేదని శెట్టికి వెల్లడించారు.

అవసరమైతే బంగ్లాదేశ్ అంగీకరిస్తే హైదరాబాద్ ఎలెవెన్‌తో జింఖానా సేడియుంలో ముూడు రోజుల ప్రాక్టీస్‌ను నిర్వహిస్తామని ప్రతిపాదించినట్టు హెచ్‌సీఏ కార్యదర్శి జాన్ వునోజ్ తెలిపాడు. వామప్ మ్యాచ్‌పై గురువారం తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉందని తెలిపాడు. టెస్టు ఆతిథ్యానికి జరుగుతున్న ఏర్పాట్లపై శెట్టి సంతప్తి వ్యక్తం చేశాడని అన్నాడు.
ఉప్పల్ మెుయిన్ రోడ్డు నుంచి స్టేడియానికి వెళ్లే అప్రోచ్ రోడ్డును పైప్‌లైన్ పనుల కోసం పూర్తిగా తవ్వేయుడంపై శెట్టి ఆందోళన వ్యక్తం చేశాడని చెప్పాడు. ఫిబ్రవరి ముూడులోగా పైప్ లైన్ పనులు పూర్తి చేయిస్తామని ఆయనకు హామీ ఇచ్చామని అన్నాడు. పాఠశాల విద్యార్థులు మ్యాచ్‌కు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా చూసుకోవాలని శెట్టి సూచించాడని తెలిపాడు.
అంతక ముందు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) కమిటీ రాజకీయాలు, నిధుల సమస్య కారణంగా ఈ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో జరగడం అనుమానంగా కనిపించిన సంగతి తెలిసిందే. అంతక ముందు హైదరాబాద్ టెస్టు మ్యాచ్ నిర్వహణను సాఫీగా జరిపే బాధ్యతలను బోర్డు జనరల్ మేనేజర్ (గేమ్స్ డెవల్‌పమెంట్) రత్నాకర్ శెట్టికి అప్పగించిన సంగతి తెలిసిందే.