Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR Playing XI vs SRH: గంభీర్ అదిరే వ్యూహం..ఫైనల్‌కు తుది జట్టు ఇదే!

ఐపీఎల్‌-2024లో ఆఖరి పోరుకు వేళైంది. టైటిల్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనుంది. ఆదివారం జరగనున్న ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు చెపాక్ వేదిక కానుంది. ఐపీఎల్ లీగ్ దశను కేవలం మూడే ఓటములతో ముగించింది. మరే జట్టుకు సాధ్యం కానీ నెట్‌రన్‌రేటుతో టేబుల్ టాపర్‌గా నిలిచింది.

ఇక క్వాలిఫయిర్-1 మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను చిత్తుగా ఓడించించి. హోరీహోరీగా సాగుతుందనుకుంటే ఏకపక్షంగా పోరును మార్చింది. అయితే ఫైనల్‌లో ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేయొద్దని, ప్రత్యేకమైన వ్యూహాలతో బరిలోకి దిగాలని కేకేఆర్ భావిస్తోంది. సన్‌రైజర్స్ ఊహలకు అందకుండా కోల్‌కతా మెంటార్ గౌతమ్ గంభీర్ తుదిపోరు కోసం మాస్టర్ ప్లాన్ వేశాడు.

Gambhir Wants Suyash Sharma in KKR s Playing XI for IPL Final vs SRH

ఈ సీజన్‌లో కేకేఆర్, ఎస్‌ఆర్‌హెచ్ రెండు సార్లు తలపడ్డాయి. రెండింట్లోనూ కోల్‌కతానే పైచేయి సాధించింది. సన్‌రైజర్స్‌పై లీగ్ మ్యాచ్‌లో నాలుగు పరుగుల తేడాతో, క్వాలిఫయిర్-1లో ఎనిమిది వికెట్ల తేడాతో కేకేఆర్ నెగ్గింది. ఐపీఎల్‌లో ఓవరాల్‌గా ఇరు జట్లు 27 మ్యాచ్‌లు ఆడగా మూడింట రెండో వంతు కోల్‌కతానే విజయం సాధించింది. సన్‌రైజర్స్ తొమ్మిదింట్లోనే గెలిస్తే, కేకేఆర్ 18 మ్యాచ్‌ల్లో విజయఢంకా మోగించింది.

అయితే క్వాలిఫయిర్-2 జరిగిన చెపాక్ పిచ్‌ను సన్‌రైజర్స్ గొప్పగా అర్థం చేసుకుని రాజస్థాన్‌కు చెక్ పట్టింది. అదే జోరును తమపై ప్రదర్శించకుండా ఉండేలా కోల్‌కతా ప్లాన్ వేస్తోంది. సన్‌రైజర్స్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మకు కౌంటర్ వేస్తూ ఎటాకివ్‌ గేమ్ ఆడే ఎడమచేతి వాటం బ్యాటర్లకు అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. కేకేఆర్ జట్టులో సునీల్ నరైన్, వెంటకేశ్ అయ్యర్, రింకూ సింగ్ ఇప్పటికే ఉన్నారు. వీళ్లతో పాటు మరో లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ నితీశ్ రాణాను బరిలోకి దించాలని యోచిస్తోంది.

Gambhir Wants Suyash Sharma in KKR s Playing XI for IPL Final vs SRH

అలాగే చెపాక్ స్పిన్‌‌కు మరింత అనుకూలిస్తే స్పిన్ ఉచ్చులో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు చిక్కేలా సుయాస్ శర్మను జట్టులోకి తీసుకురావాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. సుయాస్ రాకతో కేకేఆర్ 12 ఓవర్లు స్పిన్ బౌలింగ్ చేయగలదు. లెగ్ స్పిన్నర్ సుయాస్‌తో పాటు స్పెషలిస్ట్ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, నరైన్‌ను చెపాక్‌లో ఎదుర్కోవడం బ్యాటర్లకు సవాళే.

కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జట్టు (అంచనా)
రహ్మనుల్లా గుర్బాజా, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీశ్ రాణా/రమణ్‌దీప్ సింగ్, రింకూ సింగ్, ఆండ్రీ రసెల్, మిచెల్ స్టార్క్, వైభ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి
ఇంపాక్ట్ ప్లేయర్: సుయాస్ శర్మ.

Story first published: Saturday, May 25, 2024, 18:15 [IST]
Other articles published on May 25, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+