ఆస్ట్రేలియా పర్యటనలో, ఆ తర్వాత.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, గంభీర్ - చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మధ్య విభేదాలు తలెత్తాయని జోరుగా ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయమై స్పష్టత ఇచ్చారు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా. ఆయన ఏమన్నారో కథనంలోకి వెళ్లి తెలుసుకుందాం.
మొదటగా బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో రిటైర్మెంట్ తీసుకోవాలని రోహిత్ శర్మ భావించినా, శ్రేయోభిలాషుల సూచనలతో వెనకడుగు వేసినట్ అప్పుడు వార్తలు వచ్చాయి. అలా హిట్ మ్యాన్ రిటైర్మెంట్ విషయమై యూటర్న్ తీసుకోవడం ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌కు నచ్చలేదని, అది అసంతృప్తికి గురి చేసిందని కథనాలు కనిపించాయి.

ఆ తర్వాత టీమిండియాకు కొత్త కెప్టెన్సీ వెతకాలని రోహిత్ బీసీసీఐతో చెప్పాడని.. దీంతో అగార్కర్ రిషభ్ పంత్ పేరును సూచించగా, గంభీర్ యంగ్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ పేరును సూచించాడని వార్తలు వచ్చాయి. ఈ విషయంలో అగర్కార్ - గంభీర్ మధ్య విభేదాలు తలెత్తాయని ప్రచారం సాగింది.
తాజాగా ఈ విషయమై స్పందించిన బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా.. అవన్నీ ఉత్త వదంతులేనని క్లారిటీ ఇచ్చారు. జట్టులో ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. ఫామ్ లేక సతమతమవుతోన్న రోహిత్ శర్మకు గంభీర్ మద్దతుగా నిలిచినట్లు వెల్లడించారు. కెప్టెన్ గా కొద్ది కాలమే సాగుతాను, కొత్త కెప్టెన్ వెతకండని రోహిత్ అన్నట్లు వచ్చిన వార్తల్లో కూడా నిజం లేదని పేర్కొన్నారు.
''ఇవన్నీ అవాస్తమైన వార్తలు. రోహిత్, గంభీర్, అజిత్ అగార్కర్‌ల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. కోచ్ - చీఫ్ సెలక్టర్, కోచ్ - కెప్టెన్ మధ్య ఎలాంటి సమస్యలేవ్. బయట కనిపిస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. బీసీసీఐ రివ్యూ మీటింగ్ లో కెప్టెన్‌గా మరి కొంత కాలం కొనసాగుతానని రోహిత్ చెప్పినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం. ప్రస్తుతం అతడే కెప్టెన్. ప్రతి క్రికెటర్ కెరీర్‌లో ఫామ్ కోల్పోవడం కామన్. రోహిత్ స్వయంగా తానే ఫామ్‌లో లేడని భావించి, సిడ్నీ టెస్టు నుంచి డ్రాప్ కావాలని డిసైడ్ అయ్యాడు. రివ్యూ మీటింగ్ లో భవిష్యత్ లో ముందుకు ఎలా సాగాలనే విషయంపై చర్చించాం'' అని రాజీవ్ శుక్లా అన్నారు.