Sourav Ganguly: ఇంగ్లాండ్‌తో జట్టుతో జరుగుతున్న 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో చివరిదైన నిర్ణయాత్మక టెస్ట్ మ్యాచ్‌కు ముందు ఓవల్ మైదానంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, ఓవల్ పిచ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ ఘటన క్రీడావర్గాల్లో చర్చకు దారితీసింది. పిచ్‌ను పరిశీలించడానికి వచ్చిన టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌ను, ముఖ్యంగా ప్రధాన కోచ్ గంభీర్‌ను క్యూరేటర్ అసభ్యకరంగా సంబోధించడంతో ఈ గొడవ మొదలైంది. క్యూరేటర్ తీరుపై ఆగ్రహించిన గౌతమ్ గంభీర్.. అతనికి గట్టిగా బదులిచ్చారు. ఈ ఘటనపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందిస్తూ.. గంభీర్‌కు అలా చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.
మైదానంలో ఏం జరిగింది?
ఐదో టెస్టుకు ముందు భారత జట్టు ప్రాక్టీస్ సెషన్లో భాగంగా ఈ వివాదం తలెత్తింది. టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్, ఇతర సపోర్ట్ స్టాఫ్ పిచ్‌ను పరిశీలించడానికి వెళ్లారు. అయితే ఓవల్ పిచ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్, భారత బృందాన్ని 2.5 మీటర్ల దూరం ఉండమని, రోప్ వెనుక నిలబడి పిచ్‌ను చూడాలని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దీనికి తోడు, కూలింగ్ బాక్స్ ను మైదానంలోకి తీసుకురావడంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. భారత సపోర్ట్ స్టాఫ్‌పై అరిచారని తెలుస్తోంది.

ఈ తీరు గంభీర్‌కు ఆగ్రహం తెప్పించింది. వీడియోలలో గంభీర్, ఫోర్టిస్ వైపు వేలు చూపిస్తూ, "మీరు మాకు ఏం చేయాలో చెప్పకండి. మీరు కేవలం ఒక గ్రౌండ్స్‌మన్‌గా మీ హద్దుల్లో ఉండండి" అని తీవ్ర స్వరంతో చెప్పడం కనిపించింది. ఈ వివాదం తీవ్రం అవుతుండగా, భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ జోక్యం చేసుకుని, లీ ఫోర్టిస్‌ను పక్కకు తీసుకెళ్లి పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించారు. భారత మేనేజ్‌మెంట్ సభ్యులు కూడా ఒక ఇంగ్లీష్ అధికారికి ఈ పరిస్థితిని వివరించడానికి ప్రయత్నించారు. భారత జట్టు సభ్యులు స్పైక్ లేని బూట్లు (జాగింగ్ షూస్) ధరించి ఉన్నారని, పిచ్‌కు ఎలాంటి నష్టం జరగదని కోటక్ వివరించారు.
ఈ వివాదంపై సౌరవ్ గంగూలీ స్పందన
కోల్ కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో సౌరవ్ గంగూలీ ఈ వివాదంపై స్పందిస్తూ.. దీన్ని పెద్దదిగా చూడాల్సిన అవసరం లేదని సూచించారు. గంభీర్ ఎందుకంత కోపంగా ఉన్నాడో తనకు తెలియదన్నారు. అన్ని జట్ల కెప్టెన్లు, కోచ్‌లు గ్రౌండ్స్‌మెన్‌లతో చర్చలు జరపడం సహజమేనన్నారు. కొన్ని సార్లు సంతోషంగా, కొన్ని సార్లు అసంతృప్తిగా ఉండవచ్చని.. ఇది తన కెరీర్‌లో కూడా జరిగిందన్నారు. భవిష్యత్తులో కూడా జరుగుతుందని.. కాబట్టి మనం దీన్ని పెద్దదిగా చేయకూడగని గంగూలీ అన్నారు. అంపైర్‌లు లేదా పిచ్ క్యూరేటర్‌లతో ఇలాంటి వాగ్వాదాలు ఆటలో భాగమేనని, వాటికి అంత ప్రాధాన్యత ఇవ్వకూడదని గంగూలీ ఉద్దేశంగా తెలుస్తోంది. సిరీస్‌ను సమం చేయడానికి భారత్ ఈ టెస్ట్ మ్యాచ్‌లో బాగా ఆడాలని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ సంఘటన మైదానం వెలుపల కొంత ఉద్రిక్తతకు దారితీసినప్పటికీ, భారత జట్టు దీనిపై అధికారిక ఫిర్యాదు చేయకూడదని నిర్ణయించుకుంది. అయితే, ఈ వివాదం ఐదో టెస్ట్ మ్యాచ్‌పై అదనపు ఉత్కంఠను పెంచిందని చెప్పవచ్చు. ఇలాంటి సంఘటనలు ఒత్తిడిలో ఉన్నప్పుడు జట్టు పోరాట పటిమను పెంచుతాయని రవిచంద్రన్ అశ్విన్ వంటి ఆటగాళ్లు అభిప్రాయపడుతున్నారు. ఈ చివరి టెస్ట్‌లో భారత్ ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని పట్టుదలతో ఉంది.