Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Gambhir vs Agarkar: శుభ్‌మన్ గిల్ వైస్-కెప్టెన్సీ వెనుక అసలు కథ ఇదే!

Gambhir vs Agarkar: ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును ప్రకటించినప్పటి నుంచి శుభ్‌మన్ గిల్‌ను వైస్-కెప్టెన్‌గా నియమించడంపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇది పైకి సాధారణ నిర్ణయంగా కనిపించినప్పటికీ.. దీని వెనుక సెలక్షన్ కమిటీలో పెద్ద చర్చ, కోచ్ గౌతమ్ గంభీర్ జోక్యం ఉన్నట్లు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

భారత జట్టు సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ ఆసియా కప్ జట్టును ప్రకటిస్తున్నప్పుడు.. శుభమన్ గిల్ పేరును మొదటిగా పేర్కొని 'వైస్-కెప్టెన్' అని చెప్పారు. అయితే సెలక్షన్ కమిటీ సమావేశంలో శుభ్‌మన్ గిల్ అగార్కర్‌కు మొదటి ఎంపిక కాదని ఆశ్చర్యకరమైన సమాచారం తెలిసింది. వైస్-కెప్టెన్ పదవి కోసం అక్షర్ పటేల్ వంటి ఆటగాళ్ల పేర్లను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

Gambhir vs Agarkar The Real Story Behind Shubman Gill s Vice-Captaincy

వీడియో కాల్‌లో గంభీర్.. మారింది ఆట!
మంగళవారం జరిగిన ఈ సెలక్షన్ కమిటీ సమావేశంలో టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వీడియో కాల్ ద్వారా పాల్గొన్నారు. ఈ సమావేశంలో వైస్-కెప్టెన్ ఎంపిక గురించి సుదీర్ఘ చర్చ జరిగినప్పుడు గంభీర్ అభిప్రాయం మొత్తం ఆటనే మార్చిందని చెబుతున్నారు. భారత జట్టు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, యువ ఆటగాడిని నాయకత్వ బాధ్యతలకు సిద్ధం చేయాలని గంభీర్ గట్టిగా వాదించినట్లు తెలుస్తోంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు 35 సంవత్సరాలు దగ్గర పడుతున్నందున, దీర్ఘకాలికంగా జట్టును నడిపించే ఒక నాయకుడిని గుర్తించి, ప్రోత్సహించాల్సిన అవసరాన్ని గంభీర్ స్పష్టం చేశారు. 25 ఏళ్ల శుభ్‌మన్ గిల్ ఇప్పటికే భారత టెస్ట్ జట్టు కెప్టెన్‌గా ఉన్నందున, టీ20 జట్టుకు కూడా అతడిని కెప్టెన్‌గా సిద్ధం చేయడం సరైన నిర్ణయం అని కోచ్ గంభీర్ అభిప్రాయపడ్డారు.

దీర్ఘకాలిక పెట్టుబడి
గౌతమ్ గంభీర్ అభిప్రాయాన్ని అంగీకరించిన సెలక్షన్ కమిటీ.. శుభ్‌మన్ గిల్‌ను దీర్ఘకాలిక పెట్టుబడిగా భావించి.. అతడికి వైస్-కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించడానికి చివరికి అంగీకరించింది. "వచ్చే ఐదు సంవత్సరాల కోసం జట్టు బాధ్యతలను అప్పగించడానికి శుభమన్ గిల్ కంటే మెరుగైన అభ్యర్థిని సెలక్షన్ కమిటీ గుర్తించలేకపోయింది" అని చెబుతున్నారు.

బయటకు తెలియని నిజాలు
సెలక్షన్ కమిటీ సమావేశంలో ఇంత చర్చ జరిగినప్పటికీ, ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అగార్కర్ మాట్లాడుతూ.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్ ఎల్లప్పుడూ జట్టులో ఒక భాగంగానే ఉన్నారని మాట్లాడారు. గత సంవత్సరం జులై నుండి టీ20 మ్యాచ్‌లు ఆడనప్పటికీ, శుభ్‌మన్ గిల్ జట్టు ప్రణాళికల్లో ఎల్లప్పుడూ ఉన్నారని వారు తెలిపారు. ఈ విషయంపై అజిత్ అగార్కర్ మాట్లాడుతూ, "శుభమన్ గిల్‌లో కొన్ని నాయకత్వ లక్షణాలను మేము చూస్తున్నాం. ఇంగ్లాండ్‌లో కెప్టెన్‌గా ఉన్నప్పుడు కూడా అతని బ్యాటింగ్‌లో చూపించిన ఫామ్ మా అంచనాలను మించిపోయింది" అని అన్నారు.

Story first published: Wednesday, August 20, 2025, 17:30 [IST]
Other articles published on Aug 20, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+