కుమార్తెల కాళ్లు కడిగిన గంభీర్: బిల్లు ఎక్కడికి పంపాలంటూ కామెంట్!

హైదరాబాద్: టీమిండియా మాజీ ఓపెనర్, తూర్పు ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ తన కుమార్తెల కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్నాడు. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? శరన్నవరాత్సోవాల సందర్భంగా జరుపుకునే "అష్టమి కంజక్" ఆచారంలో భాగంగా గంభీర్ ఈ పని చేశాడు.
ఈ ఆచారం ప్రకారం తండ్రి తన కుమార్తెల కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకోవాలి. దీంతో గంభీర్ ఆ ఆచారాన్ని పాటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను గంభీర్‌ను తన ట్విటర్‌లో అభిమానులతో పంచుకున్నడు. తాను చేసిన ఈ సర్వీస్‌కు బిల్లు ఎక్కడికి పంపాలని తన భార్య నటాషాను ఉద్దేశించి సరదాగా కామెంట్ పోస్టు చేశాడు.
దీంతో తండ్రి ప్రేమ వెలకట్టలేనిదని పలువురు నెటిజన్లు ఈ ఫొటోపై కామెంట్లు చేస్తున్నారు. 2018లో క్రికెట్ అన్ని ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికిన గౌతమ్ గంభీర్ గతేడాది భారతీయ జనతా పార్టీలో చేరారు. అనంతరం ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications