
అంతర్జాతీయ అనుభవం అవసరం లేదు
స్టార్ స్పోర్ట్స్ షో 'క్రికెట్ కనెక్టెడ్'లో గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ... 'టీ20 క్రికెట్‌కు లేదా ఒక భిన్నమైన ఫార్మాట్‌కు ప్రత్యేకమైన కోచ్ ఉంటే మంచింది. అంతర్జాతీయ క్రికెట్ అనుభవం లేని, ఎక్కువ క్రికెట్ ఆడని వారు విజయవంతమైన కోచ్ కాలేరన్నది నిజం కాదు. టీ20 క్రికెట్‌లో ఆటగాళ్ల మానసిక ధోరణి మార్చడం, సానుకూల దృక్పథం పెంచడమే కోచ్ పని. భారీ షాట్లు ఆడేలా, నిర్ణీత లక్ష్యాలు సాధించేలా ప్రేరణ అందించాలి' అని గంభీర్ తెలిపాడు.

సెలక్టర్ విషయంలో అనుభవం పనికొస్తుంది
టీ20 క్రికెట్‌లో షాట్లు ఎలా ఆడాలో నేర్పించడం కోచ్ పని కాదని గంభీర్ స్పష్టం చేశాడు. 'ల్యాప్ షాట్ లేదా రివర్స్ ల్యాప్ షాట్ ఎలా ఆడాలో ఎవ్వరూ నేర్పించరు. ఏ కోచ్ కూడా ఆ పని చేయడు. ఎవరైనా అలా చేస్తున్నారంటే.. అతడు ఆటగాడికి మేలు కన్నా చెడే ఎక్కువగా చేస్తున్నారని అర్థం' అని గౌతీ అన్నాడు. విజయవంతమైన క్రికెటర్ మెరుగైన సెలక్టర్‌గా మారగలడన్నాడు. 'విజయవంతమైన కోచ్ అయ్యేందుకు ఎక్కువ అనుభవం అవసరం లేదు. కానీ సెలక్టర్ విషయంలో మాత్రం అనుభవం పనికొస్తుంది' అని గంభీర్ అభిప్రాయపడ్డాడు.

ఆఫ్రిదిపై ఫైర్
భారత ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదిపై గౌతం గంభీర్ తాజాగా మండిపడ్డాడు. కశ్మీర్ కోసం గత 70 ఏళ్లుగా పాకిస్థాన్ బిచ్చమెత్తుకుంటుందని కౌంటర్ ఇచ్చాడు. 'పాకిస్థాన్‌కు 7 లక్షల సైన్యం, 20 కోట్ల జనాభా ఉందని అఫ్రిది 16 ఏళ్ల పిల్లాడిలా మాట్లాడుతున్నాడు. అలాంటి దేశం గత 70 ఏళ్లుగా కశ్మీర్ కోసం బిచ్చమెత్తుకుంటోంది. అఫ్రిది, ఇమ్రాన్ ఖాన్, బాజ్వా లాంటి జోకర్లు భారత్‌కు, మోదీకి వ్యతిరేకంగా విషం చిమ్ముతూ పాక్ ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారు. కానీ జడ్జ్‌మెంట్ డే వరకూ కశ్మీర్ పాక్‌కు దక్కదు. బంగ్లాదేశ్ గుర్తుంది కదా?' అని 1971 యుద్దాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ గంభీర్ ఘాటుగా ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications
