Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కెప్టెన్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు, ఐపీఎల్ చరిత్రలోనే రెండో వాడిగా

Gambhirs Hai record in Virat Kohli

హైదరాబాద్: అంతా అయిపోయింది.. కేవలం పరువు కోసమే ఆడుకోవాలి అనుకుంటోన్న పరిస్థితుల్లో భారీ పట్టుదలతో ఆడి పంజాబ్‌ను చిత్తుగా ఓడించి గెలిచింది బెంగళూరు. ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. టోర్నీలో భాగంగా సోమవారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 10 వికెట్ల తేడాతో విజయం సాధించి నెట్‌ రన్‌రేట్‌ను బాగా మెరుగుపరుచుకుంది.

ఈ విజయంతో బెంగళూరు కెప్టెన్ విరాట్‌ కోహ్లీ.. గౌతమ్‌ గంభీర్‌ రికార్డును అధిగమించాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో గంభీర్‌ను వెనక్కినెట్టిన కోహ్లీ ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ 3,683 పరుగులతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. పంజాబ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఇప్పటికీప కెప్టెన్‌గా కోహ్లీ చేసిన పరుగులు 3,525. ఈ ఏడాది ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ కెప్టెన్సీ అందుకున్న గంభీర్‌ ఆ తర్వాత ఆ జట్టు వరుస వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. అయినా కెప్టెన్‌గా గంభీర్‌ చేసిన పరుగులు 3,518. మిగిలిన వారి పరుగుల రికార్డులు ఇలా ఉన్నాయి. రోహిత్‌ శర్మ(ముంబై ఇండియన్స్‌, 2,269), డేవిడ్‌ వార్నర్‌(సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మాజీ కెప్టెన్, 2099) గా ఉన్నాయి.

టోర్నీలో భాగంగా తదుపరి మ్యాచ్‌లో బెంగళూరు... సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది. బెంగళూరు వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది. సన్‌రైజర్స్‌ ఇప్పటికే ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. మ్యాచ్‌ కూడా తప్పక గెలిస్తేనే కోహ్లీ సేన ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకుంటుంది.

Story first published: Tuesday, May 15, 2018, 12:21 [IST]
Other articles published on May 15, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+