మరో పది రోజుల్లో శ్రీలంకతో భారత్ సమరం ప్రారంభంకానుంది.మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. లంకతో టీ20 సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఎంపిక కానున్నాడు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన బీసీసీఐ అతిత్వరలో రిలీజ్ చేయనుంది. అయితే హార్దిక్ పాండ్యను కాదని సూర్యను టీ20లకు కెప్టెన్‌గా నియమించడంపై అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఎందుకంటే రోహిత్ శర్మ అనంతరం భారత భవిష్యత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య అని భావిచారంతా. గత కొంతకాలంగా రోహిత్ గైర్హాజరీలో జట్టు బాధ్యతలను స్టాండ్‌బై కెప్టెన్‌గా హార్దిక్‌యే చూసుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ అనంతరం రోహిత్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో, ఇక పొట్టి ఫార్మాట్‌లో హార్దిక్‌ను అధికారిక కెప్టెన్‌గా బీసీసీఐ ప్రకటిస్తుందని అందరూ అంచనా వేశారు.

కానీ శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌కు హార్దిక్‌ను కాదని సూర్యకుమార్‌ను సారథిగా నియమించాలని బోర్డు నిర్ణయిస్తుందని తెలుస్తోంది. అంతేకాదు, టీ20 వరల్డ్ కప్-2026 వరకు సూర్యనే కెప్టెన్‌గా కొనసాగుతాడని సమచారం. అయితే సూర్యకుమార్‌ను కెప్టెన్‌గా చేయమని సెలక్టర్లతో గంభీర్ తొలుత సంప్రదించలేదంట. కానీ ఆ తర్వాత ఓ బలమైన కారణంతో సూర్యనే ఎంపిక చేయాలని గంభీర్ నిర్ణయించుకున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
హార్దిక్ పాండ్య కెప్టెన్‌గా వద్దని గంభీర్ పరోక్షంగా బలంగా పేర్కొన్నాడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. పనిభారం కారణాలు చెబుతూ జట్టుకు దూరం ఉండే ఆటగాడిని సారథిగా ఉండటాన్ని సహించనని గంభీర్ చెప్పాడని పేర్కొన్నాడు. ''సూర్యకుమార్‌ను కెప్టెన్ చేయమని నేరుగా గంభీర్ కోరలేదు. కానీ పనిభారం కారణంగా జట్టుకు దూరమయ్యే ఆటగాడు కెప్టెన్‌గా ఉంటే కలిసి పనిచేయలేనని గంభీర్ స్పష్టంగా చెప్పాడు. దీన్ని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అర్థం చేసుకుంది'' అని బీసీసీఐ అధికారి అన్నారు. కాగా, మరికాసేపట్లో శ్రీలంక పర్యటను భారత జట్టును బీసీసీఐ ప్రకటించనుంది.