Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వెస్టిండీస్ పర్యటనకు గంభీర్ దూరం, సురేష్ రైనాకు కెప్టెన్సీ బాధ్యతలు

Gautam Gambhir
ముంబై: భుజం నొప్పితో బాధ పడుతున్న కోల్‌కత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్‌ వెస్డిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి. ప్రపంచకప్‌ ఫైనల్‌లో శ్రీలంకతో మ్యాచ్‌ సందర్భంగా గాయపడిన గంభీర్‌ ఐపీఎల్‌-4లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్సీ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో గాయం తీవ్రమయింది.

నైట్‌ రైడర్స్‌ ఫిజియో ట్రైనర్‌ ఆండ్రూ లూనస్‌ గంభీర్‌కు ఆరు వారాల విశ్రాంతి అవసరమంటూ బీసీసీఐ కార్యదర్శికి రాసిన లేఖలో పేర్కొన్నారు. సీనియర్లు విశ్రాంతి తీసుకుంటుండగా సెలెక్టర్లు వెస్టిండీస్‌లో పర్యటించే భారత జట్టుకు గంభీర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. గంభీర్‌ ఈ పర్యటనకు దూరమయితే సారథ్య బాధ్యతలను సురేశ్‌ రైనా నిర్వహిస్తాడు. బుధవారం ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన ఐపియల్ నాకవుట్ మ్యాచులో కోల్‌కత్తా నైట్ రైడర్స్ ఓడిపోయింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+