Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గంభీర్‌ కోసం ఏడేళ్లు నిరీక్షించాం: ఢిల్లీ డేర్‌డెవిల్స్ సీఈఓ

Gambhir Has Unfinished Business With Delhi Daredevils, Says CEO Dua

హైదరాబాద్: టీమిండియా వెటరన్ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ కోసం తాము ఏడేళ్లు నిరీక్షించినట్లు ఢిల్లీ డేర్‌డెవిల్స్ సీఈఓ హేమంత్ దువా వెల్లడించాడు. బెంగళూరులోని ఐటీసీ గార్డెనియా హోటల్లో రెండు రోజుల పాటు జరిగిన ఆటగాళ్ల వేలంలో గౌతం గంభీర్‌ని ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు రూ. 2.8 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

వేలం అనంతరం ఢిల్లీ డేర్‌డెవిల్స్ సీఈఓ హేమంత్ దువా మాట్లాడుతూ 'ఏడేళ్లుగా గౌతమ్ గంభీర్‌‌‌ని దక్కించుకునే అవకాశం కోసం నిరీక్షించాం. అతను ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కి టైటిల్‌ని అందించే బాధ్యతను మధ్యలో విడిచిపెట్టి వెళ్లాడు. గత ఏడాది టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా డేవిడ్ వార్నర్‌ నిలిస్తే.. తర్వాత స్థానంలో గౌతమ్ గంభీర్ నిలిచాడు' అని అన్నాడు.

'గంభీర్ గొప్ప నాయకుడు. ఢిల్లీ జట్టుకి కెప్టెన్‌గా అశ్విన్, రహానే, గౌతమ్ గంభీర్‌లలో ఎవరో ఒకరిని ఎంచుకోవాలని వేలం కంటే ముందే నిర్ణయించుకున్నాం. అశ్విన్‌‌ని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంఛైజీ ఆదిలోనే కొనుగోలు చేయడంతో.. గంభీర్‌ని కొనుగోలు చేయాలని ఫిక్సయ్యాం. వేలంలో గంభీర్‌ కోసం పంజాబ్ పోటీపడుతుందని కంగారుపడ్డాం. ఆ ఫ్రాంఛైజీ వెనక్కి తగ్గడంతో మా పని సులువైంది' అని హేమంత్ దువా వివరించాడు.

ఇదిలా ఉంటే గత ఏడు సంవత్సరాలుగా గంభీర్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌‌కు ప్రాతినిథ్యం వహించాడు. గంభీర్ కెప్టెన్సీలో కోల్‌కతాను రెండు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిపాడు. తొలి ఐపీఎల్‌ సీజన్‌ 2008 నుంచి 2010 వరకు ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఆడిన గంభీర్ ఆ జట్టుకి టైటిల్‌ని అందించడంలో విఫలమయ్యాడు.

వేలం అనంతరం ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు:

ఢిల్లీ డేర్‌డెవిల్స్:
1. రిషబ్ పంత్ (రూ.8 కోట్లు-Retained)
2. క్రిస్ మోరిస్ (రూ.7.1 కోట్లు-Retained)
3. శ్రేయాస్ అయ్యర్ (రూ.7 కోట్లు-Retained)
4. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (రూ.9 కోట్లు)
5. గౌతమ్ గంభీర్ (రూ.2.8 కోట్లు)
6. జేసన్ రాయ్ (రూ.1.5 కోట్లు)
7. కొలిన్ మన్రో (రూ.1.9 కోట్లు)
8. మహ్మద్ షమి (రూ.3 కోట్లు)
9. కాగిసో రబాడా (రూ.4.2 కోట్లు)
10. అమిత్ మిశ్రా (రూ.4 కోట్లు)
11. పృథ్వి షా (రూ.1.2 కోట్లు)
12. రాహుల్ తివాతియా (రూ.3 కోట్లు)
13. విజయ్ శంకర్ (రూ.3.2 కోట్లు)
14. హర్షల్ పటేల్ (రూ.20 లక్షలు)
15. అవేష్ ఖాన్ (రూ.70 లక్షలు)
16. షాబాజ్ నదీమ్ (రూ.3.2 కోట్లు)
17. డేనియల్ క్రిస్టియన్ (రూ.1.5 కోట్లు)
18. జయంత్ యాదవ్ (రూ.50 లక్షలు)
19. గురుకీరత్ మన్ (రూ.75 లక్షలు)
20. ట్రెంట్ బౌల్ట్ (రూ.2.2 కోట్లు)
21. మన్‌జోత్ కల్రా (రూ.20 లక్షలు)
22. అభిషేక్ శర్మ (రూ.55 లక్షలు)
23. సందీప్ లామిచానె (20 ల‌క్ష‌లు)
24. న‌మ‌న్ ఓజా (1.4 కోట్లు)
25. స‌య‌న్ ఘోష్ (20 ల‌క్ష‌లు)

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 30, 2018, 16:38 [IST]
Other articles published on Jan 30, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+