Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒత్తిడిని పెంచి వైఫల్యాలకు గురి చేశారు: గంభీర్

 Gambhir Deciphers CSK Code — Rues Involvement of Other Owners in Cricketing Decisions of IPL

హైదరాబాద్: గౌతం గంభీర్ జట్టు యాజమాన్యంపై మరోసారి నిప్పులు చెరిగాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు యాజమాన్యంపై ఒత్తిడి లేకుండా ఆడనిస్తుందంటూ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ మాజీ కెప్టెన్‌ గౌతమ్‌ గంభీర్‌ ప్రశంసలు కురిపించాడు. సీఎస్‌కే యాజమాన్యం తమ కెప్టెన్‌ ధోనీని క్రికెట్‌ బాస్‌గా భావిస్తోందని.. ఫీల్డ్‌లో అతనికి పూర్తి స్వేచ్చను ఇవ్వడం ద్వారా ఒత్తిడిని తగ్గించి తద్వారా విజయాల్ని తమ ఖాతాలో వేసుకుంటుందని పేర్కొన్నాడు.

ఈ కారణంగానే ఆ జట్టు ఏడుసార్లు ఫైనల్‌కు చేరడమే కాకుండా మూడుసార్లు విజేతగా నిలిచిందని గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌ వంటి టోర్నమెంట్‌లో ఒక కెప్టెన్‌గా విజయవంతమవ్వాలంటే ఆటగాళ్లతో పాటు యాజమాన్యం సహకారం కూడా ఎంతో ముఖ్యమని గంభీర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

డేర్ డెవిల్స్‌పై ఆగ్రహం:

డేర్ డెవిల్స్‌పై ఆగ్రహం:

ఐపీఎల్‌​ చాలా ఖరీదైన వ్యాపారమని.. ఫ్రాంచైజీ ఫీజు, ఆటగాళ్లు, సహాయక సిబ్బంది జీతాలు, ప్రయాణ ఖర్చులు అంటూ యాజమాన్యం ఎక్కువ స్థాయిలోనే ఖర్చు పెట్టాల్సి వస్తోన్న గంభీర్‌ ప్రముఖ పత్రికలో రాసిన కాలమ్‌లో పేర్కొన్నాడు. అన్నిటికంటే ఇక్కడ ఇగోకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని గంభీర్‌ అసహనం వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌లోని వివిధ జట్ల యజమానులు అందరు వేర్వేరు వ్యాపారాల్లో ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించారని.. అయితే క్రికెట్‌ను కూడా ఒక వ్యాపారం లాగే భావిస్తారని.. పెట్టుబడికి తగిన లాభం​ వచ్చిందా లేదా అనే విషయం మీదే వారికి ఎక్కువ శ్రద్ధ ఉంటుందని ఘాటుగా విమర్శించాడు.

పరోక్షంగా తమ జట్టు యాజమాన్య తీరును:

పరోక్షంగా తమ జట్టు యాజమాన్య తీరును:

క్రికెటర్లలాగా వారు కూడా ఓటమిని ద్వేషిస్తారని.. విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి ఇష్టపడతారే గానీ.. ఒకవేళ వారి సలహాల వల్ల ఓటమి ఎదురైనపుడు అందుకు తగిన కారణాలు చూపితే వారి ఇగో దెబ్బతింటుందని పరోక్షంగా తమ జట్టు యాజమాన్య తీరును ఎండగట్టాడు.

కెప్టెన్‌గా బాధ్యతల నుంచి తప్పుకున్నా.. :

కెప్టెన్‌గా బాధ్యతల నుంచి తప్పుకున్నా.. :

‘కొన్ని మ్యాచ్‌ల తర్వాత కెప్టెన్‌గా బాధ్యతల నుంచి తప్పుకున్నా.. యాజమాన్యం మామూలు ఆటగాడిగానూ అవకాశం ఇవ్వలేదు. మీరెందుకు ఆ తర్వాత ఢిల్లీ జట్టులో ఆడలేదని కొందరు ఇప్పటికీ అడుగుతున్నారు. అయితే వాస్తవం వేరేలా ఉంది. ప్రధాన ఆటగాళ్లయిన రబడ, క్రిస్‌ మోరిస్‌లకు గాయాలు కావడంతో పాటు కొందరు ఆటగాళ్లు పేలవ ప్రదర్శన చేశారు.

ఒత్తిడిని పెంచడంతో విఫలమయ్యా:

ఒత్తిడిని పెంచడంతో విఫలమయ్యా:

దీంతో జట్టు వరుస వైఫల్యాలు చవిచూడాల్సి వచ్చింది. కీలక ఆటగాళ్లు సరైన సందర్భాల్లో రాణించకపోవడంతో ఈ సీజన్‌లో ఢిల్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన నాలో ఒత్తిడిని పెంచడంతో విఫలమయ్యానని' గంభీర్‌ పేర్కొన్నాడు. కాగా ఈ సీజన్‌లో ఢిల్లీ కేవలం 10 పాయింట్లతో పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.

Story first published: Wednesday, May 30, 2018, 13:24 [IST]
Other articles published on May 30, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+