Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND Vs AUS: ఆకాష్ బౌండరీ కొట్టగానే సెలబ్రేట్ చేసుకున్న గంభీర్..!

భారత్ ను ఫాలో-ఆన్ గండం నుంచి జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్ గట్టేంకించారు. జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్ 10వ వికెట్ మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. వీరిద్దరి వీరోచిత పోరాటంతో భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వేడుకలు జరుపుకున్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్‌ బౌలింగ్ లో ఆకాష్ దీప్ బౌండరీ కొట్టగా ఇండియా ఫాలో ఆన్ తప్పించుకుంది. దీంతో గంభీర్, కోహ్లీ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. హైపై ఇచ్చుకున్నారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఆనందంలో ఉన్నట్లు కనిపించాడు.
కమ్మింగ్స్ స్టంప్‌పై బాల్ వేయడంతో దాన్ని ఆకాష్ దీప్ డీప్ మిడ్ వికెట్ మీదుగా ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత బ్యాడ్ లైట్ కారణంగా అంపైర్లు ఆటను ముగించేశారు. ఆకాశ్ దీప్ 31 బంతుల్లో 27 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మరో ఎండ్‌లో బుమ్రా 27 బంతుల్లో 10 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా వీరిద్దరు వికెట్ ఇవ్వలేదు.

Gambhir celebrates as Akash Deep hits a boundary to avoid a follow-on

4వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 74.5 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. ఇండియా 193 పరుగులు వెనుకబడి ఉంది. ఐదో రోజు టీమిండియా అలౌట్ అయితే ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తోంది. వారు ఎప్పటి వరకు బ్యాటింగ్ చేసి డిక్లేర్ చేస్తారో చూడాలి. మరో పక్క రేపు వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో గబ్బా టెస్ట్ డ్రాగా ముగిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారత్ నుంచి కేఎల్ రాహుల్ అత్యధిక పరుగులు చేశాడు. 139 బంతుల్లో 84 పరుగులు చేశాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా 123 బంతుల్లో 77 పరుగులు చేశాడు.

Story first published: Tuesday, December 17, 2024, 16:16 [IST]
Other articles published on Dec 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+