INDvsAUS : కెరీర్ మొత్తం సూపర్‌గా ఎవరూ ఆడలేదే.. రాహుల్‌కు మద్దతుగా మాజీ లెజెండ్!

ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహల్ అత్యంత దారుణంగా విఫలం అవుతున్నాడు. దీంతో చాలా మంది మాజీలు కూడా జట్టులో అతని స్థానాన్ని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా వెంకటేశ్ ప్రసాద్ వంటి వారైతే రాహుల్ ఆటతీరును తెగ విమర్శించారు. అయితే ఆకాష్ చోప్రా వంటి వాళ్లు రాహుల్‌కు మద్దతుగా నిలిచారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ ద్రావిడ్ కూడా రాముల్ చాలా సత్తా ఉన్న ఆటగాడని, అతనికి మరిన్ని అవకాశాలు ఇస్తామని స్పష్టం చేశారు.

ఫామ్ లేనప్పుడే అండగా ఉండాలి..
ఇప్పుడు మాజీ ఓపెనర్, లెజెండరీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా రాహుల్‌కు మద్దతుగా నిలిచాడు. క్రికెట్ చరిత్రలో ఒక్క బ్యాటర్ కూడా తన కెరీర్ మొత్తం సూపర్‌గా ఆడలేదని, ఇలా ఫామ్‌లో లేనప్పుడే ఆటగాళ్లకు మనం మరింత మద్దతు ఇవ్వాలని గౌతీ అన్నాడు. 'కేఎల రాహుల్ గురించి మాట్లాడేవారికి అంతర్జాతీయ క్రికెట్ ఎంత కష్టమో తెలీదు. ఒక ఆటగాడు సరిగా ఆడనప్పుడే అతనికి మరింత మద్దతు ఇవ్వాలని నేను భావిస్తా. ఆడేటప్పుడు మద్దతు ఇవ్వకపోయినా పర్లేదు' అని గౌతీ పేర్కొన్నాడు.

టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు..
క్రికెట్‌లో తన కెరీర్ మొత్తం అద్భుతంగా ఆడిన ఒక్క ఆటగాడి పేరు చెప్పాలని గంభీర్ సవాల్ చేశాడు. ప్రతి ఒక్కరూ తమ కెరీర్‌లో ఏదో ఒక సమయంలో ఇలాంటి దశ ఎదుర్కోవాల్సి వచ్చిందని, కానీ ట్యాలెంట్ ఉన్న ఆటగాళ్లకు మద్దతు దక్కాలని అభిప్రాయపడ్డాడు.
అలాగే ఇప్పుడు ఆస్ట్రేలియాతో కీలక సిరీస్ జరుగుతున్న సమయంలో రాహుల్‌ను ఇలా టార్గెట్ చేయడం ఎంత మాత్రం సమంజసం కాదన్నాడు. ప్రతి ఆటగాడు తన ఆటతీరును అసెస్ చేసుకుంటాడని, కాబట్టి బయటి నుంచి ఇలా విమర్శలు చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు.

ఎవరూ చెప్పక్కర్లేదు..
'రోహిత్ తన కెరీర్ ప్రారంభించినప్పుడు తను కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ ఇప్పుడు అతని పెర్ఫామెన్స్ చూడండి. ఇదే కదా మార్పు అంటే. ఇప్పుడు ఒక సిరీస్ మధ్యలో ఉండగా ఈ విషయంపై మాట్లాడకపోవడమే మంచిది. తను ఆడుతున్నాడా లేదా? పరుగులు చేస్తున్నాడా? లేదా? అని ప్రతి ఆటగాడికీ తెలుసు. మీడియా సంస్థలు, మాజీ క్రికెటర్లు వచ్చి ఏ ఆటగాడికీ మీ ఆటతీరు బాగలేదని చెప్పకూడదు.
రాహుల్ ఎంత క్వాలిటీ ప్లేయరో మనందరికీ తెలుసు. కాబట్టి అతని గురించి మాట్లాడకుండా ఉండటమే మంచిది' అని గంభీర్ వివరించాడు. కాగా అతన్ని చివరి రెండు టెస్టులకు ప్రకటించిన జట్టులో వైస్ కెప్టెన్‌గా తొలగించిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications