న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోచ్‌ను అమాంతం గాల్లోకి ఎగిరి తన్నిన ఆటగాడు.. ఎందుకో తెలుసా? (వీడియో)

Furious Higuain kick his coach and advertising boards after ex-Chelsea striker loses temper during Juventus training

హైదరాబాద్: అర్జెంటీనా ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు గొంజలో హిగ్యుయిన్ సహనం కోల్పోయి ఏకంగా సొంత కోచ్‌ను తన్నాడు. అంతేకాదు పక్కనే ఉన్న అడ్వర్టైజింగ్ బోర్డు మీద కూడా తన ప్రతాపాన్ని చూపాడు. ఈ చర్యతో అక్కడ ఉన్న ఫుట్‌బాల్ ఆటగాళ్లు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే కోచ్ మాత్రం ఏమీ తినకపోవడం విశేషం.

చైనా ఓపెన్.. తొలి రౌండ్‌లో సైనాకు షాక్!!చైనా ఓపెన్.. తొలి రౌండ్‌లో సైనాకు షాక్!!

విషయంలోకి వెళితే.. 2019-20 ఛాంపియన్స్ లీగ్‌లో భాగంగా అట్లాటికో మాడ్రిడ్‌తో జరగాల్సిన మ్యాచ్ కోసం జువెంటస్ జట్టు ప్రాక్టీస్ సెషన్ నిర్వహించింది. మంగళవారం మధ్యాహ్నం అర్జెంటీనా స్ట్రైకర్ హిగ్యుయిన్ మరియు మరో ఇద్దరు సహచర ఆటగాళ్లు డిఫెండర్ పాత్రను పోషించారు. జువెంటస్ ఆటగాళ్లను మాడ్రిడ్‌ జట్లు ఆటగాళ్లు చుట్టుముట్టడంతో హిగ్యుయిన్ బంతిని తిరిగి పొందేందుకు ప్రయతించాడు. డ్రిల్‌లో బంతిని వెంబడించడంతో స్ట్రైకర్ హిగ్యుయిన్ విసిగిపోయి జువెంటస్ కోచింగ్ సిబ్బందిని తన్నాడు.

అక్కడితో ఆగకుండా పక్కనే ఉన్న అడ్వర్టైజింగ్ బోర్డు మీద కూడా తన ప్రతాపాన్ని చూపించాడు. హిగ్యుయిన్ తన్నడంతో కోచ్ కిందపడిపోయి వెంటనే లేచాడు. అనంతరం హిగ్యుయిన్ చర్యకు నవ్వుకున్నాడు. అడ్వర్టైజింగ్ బోర్డు తన్నుతుండగా.. ఓ ఆటగాడు వచ్చి హిగ్యుయిన్ను అక్కడి నుండి దూరంగా తీసుకెళ్లాడు. దీంతో హిగ్యుయిన్ కోపం తగ్గింది. ఈ ఘటన తర్వాత ప్రాక్టీస్ సెషన్ ఆగిపోయింది. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Story first published: Wednesday, September 18, 2019, 13:30 [IST]
Other articles published on Sep 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X