Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫన్నీ రనౌట్: బౌలర్‌కు బంతినిచ్చిన బ్యాట్స్‌మన్‌.. నాన్‌స్ట్రైకర్‌ రనౌట్ (వీడియో)!!

Funny Run-Out: One of the most comical and bizarre run out in cricket history


హైదరాబాద్:
క్రికెట్ ఆటలో రనౌట్‌లు సర్వ సాధారణం. నెమ్మదిగా పరుగెత్తడం, బౌలర్ అడ్డుగా వచ్చినపుడు, క్రీజులో ఉన్న ఆటగాళ్ల మధ్య సమన్వయం లోపించినపుడు రనౌట్‌లు అవ్వడం మనం చూసుంటాం. ఒక్కోసారి బ్యాట్స్‌మన్‌లు ఇద్దరూ ఒకేవైపు పరుగెత్తి కూడా రనౌట్ అవ్వడం చూసుంటాం. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో చూసి.. క్రికెట్ చరిత్రలో ఇలాగా కూడా రనౌట్ అవుతారా అని అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు.
Viral Video : Another Funniest Run-Out In Cricket | Oneindia Telugu

ఫన్నీ రనౌట్:

'ఫాక్స్‌ క్రికెట్‌' ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసిన ఓ వీడియో అభిమానులకు నవ్వులు తెప్పిస్తోంది. అయితే అది అంతర్జాతీయ మ్యాచ్ మాత్రం కాదు. మ్యాచ్ ఎక్కడ జరిగిందో, ఏ జట్లు ఆడాయో కూడా తెలియదు. స్ట్రైకర్‌కు బౌలర్‌ బంతి విసిరాడు. బ్యాట్స్‌మెన్‌ వెనకాల దిశగా భారీ షాట్ ఆడేందుకు ప్రయతించగా.. బంతి కాస్త అతడి కాలుకు తగిలి అక్కడే ఆగింది. బంతిని గమనించకుండా నాన్‌స్ట్రైకర్‌ పరుగు కోసం పిచ్ మధ్యకు వచ్చేసాడు. బంతి అందుకున్న బ్యాట్స్‌మన్‌ దానిని బౌలర్‌కు విసరగా.. అతడు వికెట్లను గిరాటేస్తాడు.

టిక్‌టాక్‌ కోసం?

టిక్‌టాక్‌ కోసం?

ఆ సమయంలో నాన్‌స్ట్రైకర్‌, స్ట్రైకర్‌ ఒకరికొకరు ముఖాలను చూసుకుంటూ నవ్వుకుంటారు. ఇక నాన్‌స్ట్రైకర్‌ ఔట్ అంటూ అంపైర్‌ అతన్ని పెవిలియన్‌కు పంపించాడు. ఈ ఫన్నీ రనౌట్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అయితే నాన్‌స్ట్రైకర్‌ పరుగెత్తుకొస్తున్నప్పుడు స్ట్రైకర్‌ బంతి అందుకున్నాడు కాబట్టి స్ట్రైకరే ఔటని వీడియో చూసిన నెటిజన్లు అంటున్నారు. అయితే ఇది టిక్‌టాక్‌ కోసం రూపొందించిన వీడియో అని తెలుస్తోంది. అయితే ఈ మ్యాచ్ కోసం పెద్ద మైదానం, విజేతలకు అందించే కప్పులు వెనకాల ఉండడం గమనార్హం.

కాళ్లు మొక్కుతావేంట్రా నాయనా:

ప్రస్తుతం పాక్ గడ్డపై జరుగుతున్న పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌)లో కూడా ఓ ఫన్నీ ఘటన జరిగింది. లీగ్‌లో భాగంగా లాహోర్‌ క్వాలండర్స్‌-కరాచీ కింగ్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. లాహోర్‌ ఛేజింగ్‌ చేస్తుండగా.. బౌలర్ డెల్‌ పోర్ట్‌ వేసిన 10 ఓవర్‌ ఐదో బంతిని బ్యాట్స్‌మన్‌ బెన్‌ డంక్‌ రివర్స్‌ స్వీప్‌ ఆడాడు. బంతి కాస్తా ఎడ్జ్‌ తీసుకుని అక్కడే పైకి లేచింది. అయితే కరాచీ వికెట్‌ కీపర్‌ చాడ్విక్‌ వాల్టన్‌ బంతిని అందుకోవడంలో తడబడ్డాడు. బంతి గ్రౌండ్‌ను తాకే సమయంలో ఎక్కడుందో చాడ్విక్‌కు కనబడలేదు. దాంతో డంక్‌ కాళ్లను చాడ్విక్‌ అమాంతం పట్టేసాడు.

Story first published: Tuesday, March 10, 2020, 11:17 [IST]
Other articles published on Mar 10, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+