
దక్కని శుభారంభం..
బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు శుభ్ మన్ గిల్ (20), కేఎల్ రాహుల్ (22) తమకు దక్కిన ఆరంభాలను భారీ స్కార్లుగా మలచలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన భారీ అంచనాలతో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (1) వేరియబుల్ బౌన్సుకు బలయ్యాడు. దీంతో భారత జట్టు 48 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది.
ముందు పంత్.. తర్వాత అయ్యర్
టాప్ ఆర్డర్ వైఫల్యం వల్ల కష్టాల్లో ఉన్న జట్టును వికెట్ కీపర్ రిషభ్ పంత్ (46) ఆదుకున్నాడు. తనదైన స్టైల్లో బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అయితే లంచ్ తర్వాత అతను కూడా పెవిలియన్ చేరాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్.. వెటరన్ పుజారా (90)తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పాడు.
అయ్యర్ అవుట్..?
పుజారా అవుటైన తర్వాత అయ్యర్ చక్కగా బ్యాటింగ్ చేశాడు. అయితే అతనికి అదృష్టం కూడా కలిసొచ్చింది. ఎబాదత్ హోసెన్ వేసిన 84వ ఓవర్లో బంతిని అయ్యర్ సరిగా అంచనా వెయ్యలేకోయాడు. ఎబాడత్ వేసిన డెలివరీ చాలా తక్కువ ఎత్తులో వచ్చింది. దాన్ని ఎలాగైనా ఆడేందుకు అయ్యర్ చేసిన ప్రయత్నం విఫలమైంది.
బెయిల్ ఎగర్లేదు..!
కానీ అనూహ్యంగా ఆ బంతి వికెట్లను తాకినా.. బెయిల్ కిందపడలేదు. దీంతో రూల్స్ ప్రకారం అయ్యర్ అవుట్ కాదు. ఇది చూసిన బంగ్లా ఫీల్డర్లు నోరెళ్ళబెట్టారు. ఇది చూసిన ఫ్యాన్స్ తెగ జోకులు పిలుస్తున్నారు. కొందరు మాత్రం బెయిల్ బరువు మార్చాలని, ఇటీవలి కాలంలో ఇలా బెయిల్ కిందపడని ఘటనలు ఎక్కువ అయిపోతున్నాయి అని అంటున్నారు. ఏదేమైనా అయ్యర్ లక్కే లక్కు అని నెట్టింట మీమ్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications












