నోబాల్ వివాదంతో పండగ చేసుకున్న మీమర్స్

నిన్నటి రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ చివరి ఓవర్లో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. నోబాల్ వివాదం క్రికెట్ ప్రపంచంలో అతి పెద్ద ఇష్యూ అయిపోయింది. ఎవరికీ వారు తమ తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. చాలా మంది అది క్లియర్ నోబాల్ అని పేర్కొంటున్నారు. కొందరు మాత్రం హడావుడిలో అంపైర్ తీసుకున్న నిర్ణయమని.. దాన్ని మనం గౌరవించాలంటూ పోస్టులు పెడుతున్నారు. నిన్నటి మ్యాచ్ క్రికెట్ అభిమానులకు వినోదంతో పాటు.. రసవత్తరమైన వివాద అనుభూతిని కూడా పంచింది. ఈ క్రమంలో మీమర్స్‌కు పుష్కలమైన ఫీడ్ దొరికింది. ఇక ఏముంది ఈ మ్యాచ్ మీద మీమ్స్‌తో విరుచుకుపడ్డారు. అంపైర్ నితిన్ మీనన్ మీద ట్రోల్స్, మీమ్స్‌తో దాడికి దిగారు. ఈ మ్యాచ్ విషయంలో వచ్చిన కొన్ని మీమ్స్‌ను ఒకసారి చూద్దాం.
అంపైరింగ్ చేస్తానంటూ పంత్ మీమ్..
ఢిల్లీ కెప్టెన్ పంత్ డ్రీమ్ 11కు యాడ్వర్టైజింగ్ పార్ట్‌నర్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు డ్రీమ్ 11 యాడ్స్‌లో పంత్.. ఇంకొకరు పనిచేస్తుండగా కల్పించుకుని.. ఈ పని నేను చేస్తా కానీ ముందు డ్రీమ్ 11 టీంను ఏర్పాటు చేసుకో అంటూ డైలాగ్ కొడుతుంటాడు. అదే డైలాగ్‌ను ఉపయోగించి ఓ మీమర్ నిన్నటి మ్యాచ్ అంపైర్లకు సెటైర్ వేస్తూ మీమ్ చేశాడు. అంపైర్లు తప్పుకోండి నేను అంపైరింగ్ చేస్తా.. అంతవరకు మీరు డ్రీమ్ 11 జట్టును సెలెక్ట్ చేసుకోండంటూ పంత్ అంటున్నట్లు మీమ్ క్రియేట్ చేశారు. ఇది బాగా వైరల్ అవుతోంది.
డ్రీమ్ 11 గేమ్ ఛేంజర్ ఆఫ్ ది మ్యాచ్‌గా అంపైర్
ప్రతి ఐపీఎల్ మ్యాచ్ అనంతరం పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ జరుగుతుంది. ఈ ప్రెజెంటేషన్లో మ్యాచ్ మలుపు తిప్పిన ఆటగాడికి డ్రీమ్ 11 గేమ్ ఛేంజర్ అవార్డు ఇస్తుంటారు. అయితే నిన్నటి మ్యాచ్‌లో అంపైర్ నితిన్ మీనన్.. మ్యాచ్ కీలక దశలో క్లియర్ నోబాల్‌ను ఫెయిర్ డెలివరీగా ప్రకటించడంతో పెద్ద వివాదం జరగడంతో పాటు ఢిల్లీ పావెల్ ఏకాగ్రత కోల్పోవడంతో తర్వాత రాజస్థాన్ గెలిచింది. అతను మ్యాచ్‌ను రాజస్థాన్ వైపు మలుపు తిప్పినట్లు ఓ మీమ్‌ను మీమర్ రూపొందించాడు. ఇందులో గేమ్ ఛేంజర్ అవార్డును నితిన్ మీనన్ ఆర్ఆర్ జెర్సీ వేసుకుని అందుకున్నట్లు ఫోటోను మాడిఫైడ్ చేశాడు.
థర్డ్ అంపైర్ పరిస్థితిపై చాహల్ పోజుతో..
నిన్నటి మ్యాచ్ చివరి ఓవర్లో నోబాల్ వివాదం అంత తీవ్రమవుతుంటే.. ఆన్ ఫీల్డ్ అంపైర్లకు ఏమాత్రం సపోర్ట్ చేయకుండా థర్డ్ అంపైర్ నింపాదిగా వ్యవహరించాడు. థర్డ్ అంపైర్ కలుగ జేసుకుంటే అంత పెద్ద వివాదం జరగకపోయేది. కానీ థర్డ్ అంపైర్ తన పాత్రను సరిగా నిర్వర్తించలేదు. ఆన్ ఫీల్డ్ అంపైర్ నోబాల్ విషయంలో సిగ్నల్ ఇచ్చినా ఇవ్వకున్నా థర్డ్ అంపైర్ సమీక్షించే అధికారం ఉంటుంది. కానీ ఈ విషయంలో ఏమాత్రం హడావుడి చూపకుండా థర్డ్ అంపైర్ చిల్ అవుతున్నట్లు.. చాహల్ ఐకానిక్ పోజులో ఓ మీమ్ నెట్టింటా వైరలవుతోంది.
4చాహల్, కుల్దీప్ యాదవ్ ఫైటింగ్
చివరి ఓవర్లో ఓ వైపు రచ్చ జరుగుతుంటే ఢిల్లీ ప్లేయర్ కుల్దీప్ యాదవ్, రాజస్థాన్ ప్లేయర్ చాహల్ సరదాగా ఫైట్ చేసుకోవడం కూడా నెట్టింటా వైరలైంది. దీనిపై ఓ మీమర్ తన క్రియేటివిటీని చూపించాడు. అందరూ నోబాల్ విషయం గురించి ఆసక్తిగా ఎదురుచూస్తుంటే వీరిద్దరేమో గొడవపడుతున్నట్లు ఓ తమిళ మూవీ క్లిప్ ఉపయోగించి మీమ్ చేశాడు. అలాగే మరికొన్ని మీమ్స్ కూడా వైరలయ్యాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications