Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బంతి బరువా? లేక నువ్వా?: చాహల్‌తో యువీ ఫన్నీ ఇంటర్యూ

హైదరాబాద్: బెంగుళూరు వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా లెగ్ స్ఫిన్నర్ యజువేంద్ర చాహల్ 6 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో మూడో టీ20లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుపై టీమిండియా 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఒకానొక దశలో 119 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి గెలుపు దిశగా పయనిస్తోన్న ఇంగ్లాండ్ జట్టుని చాహల్ తన స్పిన్ మాయాజలంతో 8 పరుగుల తేడాతో 8 వికెట్లు తీశాడు. దీంతో మ్యాచ్ అనంతరం మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డుతో పాటు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని సైతం సొంతం చేసుకున్నాడు.

మూడో టీ20లో చాహల్ ప్రదర్శనకు టీమిండియా వెటనర్ ఆటగాడు యువరాజ్‌ సింగ్ ముగ్ధుడయ్యాడు. టీమిండియా విజయం సాధించిన వెంటనే చాహల్‌ను తన చేతులతో పైకెత్తాడు. అంతేకాదు మ్యాచ్‌ తర్వాత బీసీసీఐ టీవీ రిపోర్టర్‌గా అవతారం ఎత్తి చాహల్‌ను సరదాగా ఇంటర్వ్యూ కూడా చేశాడు.

Funny interview of Yuzvendra chahal by Yuvraj singh

చేతులతో ఎత్తుకున్నప్పుడు నీ ఫీలింగ్‌ ఏంటని యువీ అడిగితే.. 'ఎంతో బాగుంది. డీడీఎల్‌జే లాగుంది' అని బాలీవుడ్‌ సినిమాను ఉద్దేశించి చాహల్‌ సరదాగా సమాధానమిచ్చాడు. ఆ తర్వాత బంతి బరువుగా ఉందా లేక నువ్వా? అని అడిగితే.. 'నేనే కొంచెం ఎక్కువ' అని యజ్వేంద్ర ఓ నవ్వుతూ యువీకి సమాధానమిచ్చాడు.

ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్‌ చేశావు. ఈ ఫీలింగ్ ఎలా ఉంది? అని యువరాజ్ ప్రశ్నిస్తే 'సొంత మైదానంలో ఈ ఘనతను సాధించినందుకు ఎంతో ఆనంద పడుతున్నాను' అని చాహల్‌ చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియోని యువరాజ్ సింగ్ తన ఫేస్‌బుక్‌ పేజీలో అభిమానుల కోసం షేర్‌ చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+