For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs AUS: ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా..వన్డే-టీ20 సిరీస్ పూర్తి షెడ్యూల్ విడుదల

IND vs AUS: ఐపీఎల్ 2025 సీజన్ జరుగుతుండగా.. ఆస్ట్రేలియా 2025-26 సీజన్ కోసం తన దేశీయ అంతర్జాతీయ షెడ్యూల్ ను ప్రకటించింది. ఇందులో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన షెడ్యూల్ కూడా ఉంది. ఈ సమాచారాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా మార్చి 30 ఆదివారం సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా ధ్రువీకరించింది. అక్టోబర్ 19 నుండి నవంబర్ 8 వరకు ఆస్ట్రేలియాలో టీమిండియా-ఆసీస్ జట్లు ఎనిమిది మ్యాచ్‌లు ఆడతాయని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ఇవి ఎనిమిది వేర్వేరు వేదికలలో జరుగుతాయి. దీనితో పాటు ఆస్ట్రేలియా ఆగస్టులో దక్షిణాఫ్రికాతో వైట్-బాల్ సిరీస్‌ను కూడా ఆడనుంది, ఇందులో మూడు వన్డేలు, అదే సంఖ్యలో టీ20 మ్యాచ్‌లు ఉంటాయి. 2025-26 యాషెస్ నవంబర్ 21న ప్రారంభమవుతుంది. యాషెస్ తొలి టెస్ట్ మ్యాచ్ పెర్త్‌లో జరుగుతుంది.

భారత్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌ల షెడ్యూల్‌ను కూడా క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. అక్టోబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు 21 రోజుల్లో టీం ఇండియా మొత్తం 8 మ్యాచ్‌లు ఆడనుంది. వన్డే సిరీస్‌లో 3 మ్యాచ్‌లు, టీ20 సిరీస్‌లో 5 మ్యాచ్‌లు ఆడనున్నాయి. దీని తరువాత, యాషెస్ 2025-26 నవంబర్ 21 నుండి ప్రారంభమవుతుంది. యాషెస్ తొలి టెస్ట్ మ్యాచ్ పెర్త్‌లో జరుగుతుంది.

Full Schedule of India s Tour of Australia for ODI and T20 Series Released

ఇండియా-ఆస్ట్రేలియా వన్డే షెడ్యూల్
అక్టోబర్ 19, 2025 -మొదటి వన్డే- పెర్త్ స్టేడియం
అక్టోబర్ 23- రెండో వన్డే-అడిలైడ్
అక్టోబర్ 25 -మూడో వన్డే -ఎస్‌సీజీ

ఇండియా ఆస్ట్రేలియా టీ-20 షెడ్యూల్
అక్టోబర్ 29-మొదటి టీ20 -కాన్ బెర్రా
అక్టోబర్ 31 - రెండో టీ20 -ఎంసీజీ
నవంబర్ 2 మూడో టీ20 -హోబర్ట్
నవంబర్ 6 -నాలుగో టీ20 -గోల్డ్ కోస్ట్
నవంబర్ 8 ఐదో టీ20 - గబ్బా

యాషెస్ 2025-26 ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్
నవంబర్ 21-25 - మొదటి టెస్ట్ - పెర్త్ స్టేడియం
డిసెంబర్ 4-8 - రెండవ టెస్ట్ - గబ్బా
డిసెంబర్ 17-21 - మూడో టెస్ట్ - అడిలైడ్
డిసెంబర్ 26-30 - నాలుగో టెస్ట్ - ఎంసీజీ
జనవరి 4-8 - ఐదో టెస్ట్ - ఎస్‌సీజీ

Story first published: Sunday, March 30, 2025, 16:24 [IST]
Other articles published on Mar 30, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+