హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఏకైక టెస్టు మ్యాచ్‌పై అనుమానాలు తొలగిపోయాయి. శుక్రవారం (జనవరి 27)న ఇరు దేశాల బోర్డులు బంగ్లాదేశ్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ని ప్రకటించాయి.
ఈ షెడ్యూల్ ప్రకటనతో బంగ్లాదేశ్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్ హైదరాబాద్‌లోనే జరగనుంది. ఫిబ్రవరి 2వ తేదీన బంగ్లాదేశ్ హైదరాబాద్ నగరానికి రానుంది. రెండు రోజుల విశ్రాంతి ఆ తర్వాత ట్రైనింగ్, అనంతరం భారత్ ఏ జట్టుతో 5,6 తేదీల్లో రెండు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది.
ఈ వార్మప్ మ్యాచ్ సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో జరగనుంది. ఇక ఫిబ్రవరి 9 నుంచి 13 వరకూ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో టీమిండియా బంగ్లా టెస్టు మ్యాచ్ ఆడనుంది. టెస్టు మ్యాచ్ ముగిసిన అనంతరం 14వ తేదీన ఆ జట్టు తిరుగు ప్రయాణం కానుంది.

భారత పర్యటనకు వస్తున్న బంగ్లాదేశ్‌కు భారత్‌లో ఇదే తొలి టెస్టు మ్యాచ్ కావడం విశేషం. భారత్-బంగ్లాదేశ్ ఏకైక టెస్టు మ్యాచ్ షెడ్యూల్:
ఫిబ్రవరి 2 - Bangladesh team arrives in Hyderabad
ఫిబ్రవరి 3 - Rest/training
ఫిబ్రవరి 4 - Rest/training
ఫిబ్రవరి 5 to 6 - Two-day practice match Vs India A in Secunderabad
ఫిబ్రవరి 7 - Rest/training
ఫిబ్రవరి 8 - Training
ఫిబ్రవరి 9 to 13 - One-off Test Vs India in Hyderabad
ఫిబ్రవరి 14 - Bangladesh team departs for Dhaka