బెంగళూరు: ఐసిసి ప్రపంచ ట్వంటీ20, 2016 వచ్చే నెలలో జరగనున్న నేపథ్యంలో భారత్ ఆసియా కప్ టీ20 టోర్నమెంటును సన్నాహకంగా ఉపయోగించుకోనుంది. ఆసియా కప్‌లో క్వాలీఫైడ్ రౌండ్లు ఫిబ్రవరి 19 నుంచి జరగనున్నాయి. అసలైన మ్యాచులు బంగ్లాదేశ్ వేదికగా ఫిబ్రవరి 24 నుంచి మొదలు కానున్నాయి.
ఆసియా కప్ చరిత్రలో తొలిసారి 50 ఓవర్లకు బదులు 20ఓవర్ల మ్యాచులను నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన 12 ఎడిషన్లు కూడా 50ఓవర్ల మ్యాచులతోనే జరిగాయి. కాగా, శ్రీలంక మినహా అన్ని జట్లు ఈ టోర్నీకి తమ జట్లను ప్రకటించాయి.
ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌ను 3-0తో, శ్రీలంకతో జరిగిన సిరీస్‌ను 3-1 దక్కించుకున్న మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని టీమిండియానే ఆసియా కప్ టోర్నీలో ఫేరరేట్‌గా బరిలోకి దిగింది.

నోట్: క్వాలీఫైయింగ్ టోర్నమెంట్లలో ఆఫ్ఘనిస్థాన్, హాంగ్‌కాంగ్, ఒమన్, యూఏఈ లు ఫిబ్రవరి 19-22 వరకు ఆడనున్నాయి. ఇందులో విజయం సాధించిన జట్లు ఫిబ్రవరి 24-మార్చి 6 వరకు జరిగే అసలైన టోర్నమెంట్ లో పాల్గొననున్నాయి.
జట్ల వివరాలు:
India: మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్య, రవిచంద్రన్ అశ్విన్, జాస్ప్రిత్ బూమ్రా, ఆశిష్ నెహ్రా, సురేష్ రైనా, అజింక్య రహానే, హర్భజన్ సింగ్, మహ్మద్ షమీ, పవన్ నేగి.
Pakistan: Shahid Afridi (captain), Mohammad Hafeez, Shoaib Malik, Umar Akmal, Sarfraz Ahmed (wicketkeeper), Immad Wasim, Anwer Ali, Babar Azam, Mohammad Nawaz, Mohammad Aamir, Iftikhar Ahmed, Mohammad Irfan, Rumman Raees, Wahab Riaz, Khurram Manzoor.
Bangladesh: Mashrafe Mortaza (captain), Shakib Al Hasan, Imrul Kayes, Mohammad Mithun, Mahmudullah, Mushfiqur Rahim (wicketkeeper), Soumya Sarkar, Sabbir Rahman, Nasir Hossain, Mustafizur Rahman, Al-Amin Hossain, Taskin Ahmed, Arafat Sunny, Abu Hider, Nurul Hasan.
Sri Lanka: జట్టును ప్రకటించాల్సి ఉంది.
Afghanistan: Asghar Stanikzai (captain), Noor Ali Zadran, Mohammad Shahzad (wicketkeeper), Usman Ghani, Mohammad Nabi, Karim Sadiq, Shafiqullah, Rashid Khan, Amir Hamza, Dawlat Zadran, Shapoor Zadran, Gulbadin Naib, Samiullah Shenwari, Najibullah Zadran, Yamin Ahmadzai.
Hong Kong: Tanwir Afzal (captain), Aizaz Khan, Anshy Rath, Babar Hayat, Christopher Carter (wicketkeeper), Mark Chapman, Haseeb Amjad, Adil Mehmood, Nadeem Ahmed, Nizakat Khan, Kinchit Shah, Ninad Shah, Tanveer Ahmed, Waqas Barkat, Waqas Khan.
Oman: Sultan Ahmed (captain and wicketkeeper), Aamir Kaleem (vice-captain), Aaqib Sulehri, Adnan Ilyas, Amir Ali, Munis Ansari, Bilal Khan, Jatinder Singh, Ajay Lalcheta, Mehran Khan, Rajeshkumar Ranpura, Sufyan Mehmood, Vaibhav Wategaonkar, Zeeshan Maqsood, Zeeshan Siddiqui.
United Arab Emirates: Amjad Javed (captain), Mohammad Kaleem, Rohan Mustafa, Shaiman Anwar, Mohammad Shahzad, Swapnil Patil (vice-captain and wicketkeeper), Usman Mushtaq, Ahmed Raza, Zaheer Maqsood, Mohammad Naveed, Farhan Ahmed, Qadeer Ahmed, Mohammad Usman, Fahad Tariq, Saqlain Haider.