Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: ఆర్సీబీకి భారీ ప్రైజ్ మనీ.. ఎవరెవరికి ఎంతంటే?

ఐపీఎల్-2024 సీజన్ అదిరింది. ఏకపక్షంగా ముగిసిన ఫైనల్ మినహా టోర్నీ ఆద్యంతం హోరాహోరీగా సాగింది. క్రికెట్ అభిమానులకు ఫుల్ మీల్స్ అందాయి. స్టేడియం బయటపడిన సిక్సర్లు, వికెట్లు ఎగిరిపడిన వికెట్లు, మెరుపు ఫీల్డింగ్ విన్యాసాలతో ఈ సీజన్ వినోదాన్ని పంచింది. అంతేగాక లీగ్ చరిత్రలో నిలిచిపోయే రికార్డులు నమోదయ్యాయి. గత సీజన్లలో నెలకొన్న అత్యధిక 200+ స్కోర్లు, సిక్సర్లు, అత్యధిక టీమ్ స్కోర్లు రికార్డులు బద్దలయ్యాయి.

ఇక టైటిల్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్‌కు రూ. 20 కోట్లు, రన్నరప్‌ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు రూ. 12.5 కోట్ల భారీ నజరానా దక్కింది. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు, అంతేగాక సత్తాచాటిన ఆటగాళ్లకు కూడా ప్రైజ్‌మనీ దక్కింది. ఏఏ జట్టుకు, ఎవరెవరికీ ఎంత మనీ దక్కాయో ఓ సారి చూద్దాం!

Full List of IPL 2024 Prize Money Winners How much for RCB

విజేత: కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌ - రూ.20 కోట్లు
రన్నరప్: సన్ రైజర్స్ హైద‌రాబాద్ - రూ.12.5 కోట్లు
3వ స్థానం: రాజస్థాన్ రాయల్స్ - రూ.7 కోట్లు
4వ స్థానం: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - రూ.6.50 కోట్లు
ఆరెంజ్ క్యాప్: విరాట్ కోహ్లీ (741 రన్స్) - రూ.15 లక్షలు
పర్పుల్ క్యాప్: హర్షల్ పటేల్ (24 వికెట్లు)- రూ.15 లక్షలు
అత్యంత విలువైన ఆటగాడు: సునిల్ నరైన్ - రూ.12 లక్షలు
ఎమర్జింగ్ ప్లేయర్: నితీశ్ రెడ్డి - రూ.10 లక్షలు
సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్: జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్‌ (234)- రూ.10 లక్షలు
ఫాంటసీ ప్లేయర్: సునిల్ నరైన్ - రూ.10 లక్షలు
క్యాచ్ ఆఫ్ ది సీజన్: రమణ్‌దీప్ సింగ్ - రూ.10 లక్షలు
ఫెయిర్ ప్లే అవార్డు: సన్ రైజర్స్ హైద‌రాబాద్ - రూ.10 లక్షలు
అత్యధిక సిక్సర్లు: అభిషేక్ శర్మ (42)- రూ.10 లక్షలు
అత్యధిక ఫోర్లు: ట్రావిస్ హెడ్ (64)- రూ.10 లక్షలు
బెస్ట్ గ్రౌండ్ అండ్ పిచ్: ఉప్పల్ స్టేడియం - రూ.50 లక్షలు

Story first published: Monday, May 27, 2024, 21:50 [IST]
Other articles published on May 27, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+