న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనికి షాకిచ్చిన బీసీసీఐ: సెంట్రల్ కాంట్రాక్టులో చోటు దక్కించుకున్న మొత్తం ఆటగాళ్లు వీరే!

MS Dhoni Left Out Of BCCI Annual Central Contracts List || Oneindia Telugu
Full List of BCCIs Contracted Players For 2020


హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి బీసీసీఐ షాకిచ్చింది. అక్టోబర్ 2019 నుంచి సెప్టెంబర్ 2020 మధ్య కాలానికి గాను వార్షిక ప్లేయర్ కాంట్రాక్టుల జాబితాను భారతదేశ క్రికెట్ నియంత్రణ బోర్డు(బీసీసీఐ) గురువారం ప్రకటించింది. ఈ జాబితాలో మాజీ కెప్టెన్ మహేంద్ర ధోని పేరు లేదు.

బోర్డు ప్రకటించిన ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టులో గ్రేడ్ ఎ+ జాబితాలో ముగ్గురు ఆటగాళ్లకు చోటు దక్కగా... ఏలో పదకొండు మంది, బీలో ఐదుగురు, సీఎలో ఎనిమిది మంది ఉన్నారు. ఎ+ గ్రేడ్‌లో ఉన్న ఆటగాడికి రూ. 7 కోట్లు, ఎ గ్రేడ్‌లో ఉన్న క్రికెటర్లకు రూ. 5 కోట్లు, బి గ్రేడ్‌లో ఉన్న క్రికెటర్లకు 3 కోట్లు, సి గ్రేడ్‌లో ఉన్న క్రికెటర్లకు ఒక కోటి చొప్పున వేతనం లభిస్తుంది.

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి ధోని ఔట్బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి ధోని ఔట్

ఇక, ఏ+ గ్రేడ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాలకు చోటు లభించింది. ఏ గ్రేడ్‌లో అశ్విన్, జడేజా, భువనేశ్వర్, పుజారా, రహానే, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, కుల్దీప్ యాదవ్, రిషభ్ పంత్‌లు ఉన్నారు.

బీ గ్రేడ్ జాబితాలో వృద్ధిమాన్ సాహా, ఉమేశ్ యాదవ్, యజువేంద్ర చాహల్, హార్దిక్ పాండ్యా, మయాంక్ అగర్వాల్‌లకు చోటు దక్కగా... సీ గ్రేడ్‌లో కేదార్ జాదవ్, నవదీప్ సైనీ, దీపక్ చాహర్, మనీష్ పాండే, హనుమ విహారి, శార్దూల్ ఠాకూర్, శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్‌లు ఉన్నారు.

వీరిలో నవదీప్‌ సైనీ, మయాంక్‌ అగర్వాల్‌, శ్రేయస్‌ అ‍య్యర్‌, వాషింగ్టన్‌ సుందర్‌, దీపక్‌ చాహర్‌లు తొలిసారి బోర్డు కాంట్రాక్ట్‌ జాబితాలో చోటు దక్కించుకున్నారు. టీమిండియా(సీనియర్ పురుషులు)బీసీసీఐ చెల్లించనున్న వేతనాలు ఈ క్రంది విధంగా ఉన్నాయి.


(అక్టోబర్ 2019 నుండి సెప్టెంబర్ 2020 వరకు):

గ్రేడ్ A + - INR 7 Cr
గ్రేడ్ A - INR 5 Cr
గ్రేడ్ B - INR 3 Cr
గ్రేడ్ సి - INR 1 Cr


ఏ+ గ్రేడ్ జాబితాలో చోటు దక్కించుకున్న ఆటగాళ్లు:

1. విరాట్ కోహ్లీ
2. రోహిత్ శర్మ
3. జస్ప్రీత్ బుమ్రా


ఏ గ్రేడ్ జాబితాలో చోటు దక్కించుకున్న ఆటగాళ్లు:
1. అశ్విన్
2. జడేజా
3. భువనేశ్వర్
4. పుజారా
5. రహానే
6. కేఎల్ రాహుల్
7. శిఖర్ ధావన్
8. మహ్మద్ షమీ
9. ఇషాంత్ శర్మ
10. కుల్దీప్ యాదవ్
11. రిషభ్ పంత్‌


బి గ్రేడ్ జాబితాలో చోటు దక్కించుకున్న ఆటగాళ్లు:
1. వృద్ధిమాన్ సాహా
2. ఉమేశ్ యాదవ్
3. యజువేంద్ర చాహల్
4. హార్దిక్ పాండ్యా
5.మయాంక్ అగర్వాల్‌


సి గ్రేడ్ జాబితాలో చోటు దక్కించుకున్న ఆటగాళ్లు:
1. కేదార్ జాదవ్
2. నవదీప్ సైనీ
3. దీపక్ చాహర్
4. మనీష్ పాండే
5. హనుమ విహారి
6. శార్దూల్ ఠాకూర్
7. శ్రేయాస్ అయ్యర్
8. వాషింగ్టన్ సుందర్‌

Story first published: Thursday, January 16, 2020, 15:23 [IST]
Other articles published on Jan 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X