Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ వేలానికి 351 మంది: పూర్తి జాబితా ఇదే

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలానికి రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 20వ తేదీన జరగనున్న వేలంలో 351 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఐపీఎల్ వేలం ఫిబ్రవరి 20వ తేదీన బెంగుళూరులో జరగనుంది.

ఐపీఎల్‌ వేలంలో ఉన్న ఆటగాళ్ల పూర్తి జాబితా

దీంతో తాజాగా ఐపీఎల్ గవర్నింగ్ బాడీ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విషయాన్ని ధృవీకరించింది. మొత్తం 799 మంది ఆటగాళ్లు వేలం కోసం తమ పేర్లను దరఖాస్తు చేసుకోగా, ఇందులో 351 మందికి మాత్రమే అవకాశం లభించింది.

Full list of cricketers (351) for IPL Players Auction 2017

ఇందులో 122 మంది అంతర్జాతీయ క్రికెటర్లు ఉన్నారు. మరోవైపు ఆరుగురు అసోసియేట్ దేశాలు (ఆఫ్ఘనిస్థాన్, యూఏఈ)కు చెందిన వారు ఉన్నారు. వీరిలో టీ20 స్పెషలిస్టులైన బెన్ స్టోక్స్, మోర్గాన్, వోక్స్, మిచెల్ జాన్సన్, మాథ్యూస్, ఇషాంత్‌ శర్మ లాంటి ఆటగాళ్లు కూడా ఉన్నారు.

ఇప్పటికే వీరి కనీసధరను రూ.2 కోట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. గత వేలంలో రికార్డు స్థాయిలో రూ.8.5 కోట్లకు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు అమ్ముడుపోయిన పవన్‌నేగి ఈసారి 30 లక్షలకు పడిపోయాడు. మరోవైపు ఈసీజన్‌తో ఆటగాళ్ల కాంట్రాక్టు పూర్తి కానుంది.

ఇదిలా ఉంటే వచ్చే సీజన్(2018)లో అందరు ఆటగాళ్లు వేలానికి రానున్నారు. స్పాట్‌ ఫిక్సింగ్ కుంభకోణంలో రెండేళ్ల పాటు నిషేధం నుంచి బయటపడే చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలు 2018 సీజన్ ద్వారా లీగ్‌లోకి తిరిగి ప్రవేశించనున్నాయి.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+