For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 10లో 20 మంది కామెంటేటర్లు: పాకిస్థాన్‌కు మొండిచెయ్యి

ఐపీఎల్ 10వ సీజన్‌కు సంబంధించిన కామెంటేటర్ల జాబితాను బీసీసీఐ మంగళవారం విడుదల చేసింది. బీసీసీఐ విడుదల చేసిన జాబితాలో పాకిస్థాన్‌కు చెందిన ఏ ఒక్క కామెంటేటర్‌కి కూడా చోటు కల్పించలేదు.

By Nageshwara Rao

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 10వ సీజన్‌కు సంబంధించిన కామెంటేటర్ల జాబితాను బీసీసీఐ మంగళవారం విడుదల చేసింది. బీసీసీఐ విడుదల చేసిన జాబితాలో పాకిస్థాన్‌కు చెందిన ఏ ఒక్క కామెంటేటర్‌కి కూడా చోటు కల్పించలేదు.

మొత్తం 20 మంది కామెంటేటర్ల బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ జాబితాలో మహిళలు కూడా ఉన్నారు. 47 రోజుల పాటు దేశ వ్యాప్తంగా ఉన్న 10 వేదికల్లో జరగనున్న ఐపీఎల్ 10వ సీజన్ ప్రారంభ వేడుకలు మరికొన్ని గంటల్లో హైదరాబాద్‌‌లోని ఉప్పల్ స్టేడియంలో జరగనున్నాయి.

తొమ్మిది సీజన్లు విజయవంతంగా ముగించుకుని పదో సీజన్ జరుపుకుంటున్న ఐపీఎల్‌లో కామెంటేటర్లగా వ్యవహరిస్తారంటూ చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే చివరకు ఐపీఎల్ నిర్వాహకులు 20 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది.

Full list of commentators for IPL 2017; No Pakistan cricketer in panel

ఇటీవల భారత్, ఆస్ట్రేలియాల మధ్య ముగిసిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో తమ వ్యాఖ్యానంతో అభిమానులను ఆకట్టుకున్న ఆసీస్‌ మాజీ క్రికెటర్లు మైకెల్‌ క్లార్క్‌, బ్రెట్‌ లీ, మాథ్యూ హెడెన్‌‌లు కూడా ఐపీఎల్‌లోనూ సందడి చేయనున్నారు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కూడా కామెంటేటర్ల జాబితాలో ఉన్నాడు.

వీరితో పాటు సంజయ్‌ మంజ్రేకర్‌, రవిశాస్త్రి, సునీల్‌ గవాస్కర్‌, మైకెల్‌ హస్సీ, బ్రెండన్‌ జులియన్‌, స్కాట్‌ స్టైరిస్‌, పోమ్మి మాంగ్వా, సిమెన్‌ డోల్‌, అంజుమ్‌ చోప్రా, శివ, డి. మారిసన్‌, ఇషా గుహ, లిసా స్తేలేఖర్‌, మెలాని జోన్స్‌, మురళీ కార్తీక్‌, డారెన్‌ గంగలు టీవీ కామెంటేటర్లగా నిర్వహించనున్నారు.

గత సీజన్‌లో పలువురు పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు రమీజ్ రాజా, షోయబ్ అక్తర్, వకార్ యూనిస్, వసీం అక్రంలు కామెంటేటర్లుగా వ్యవహరించినప్పటికీ, పదో సీజన్‌లో ఏ ఒక్క పాక్ కామెంటేటర్‌కు ఐపీఎల్ నిర్వహకులు చోటు కల్పించలేదు.

కామెంటేటర్ల జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన ఏడుగురు మాజీ క్రికెటర్లకు చోటు లభించగా, ఇండియా తరుపున ఆరుగురికి మాత్రమే ఉన్నారు. న్యూజిలాండ్ నుంచి ముగ్గురు, ఇంగ్లాండ్ నుంచి ఇద్దురు, వెస్టిండిస్, జింబాబ్వే నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.

Full list of commentators for IPL 2017
1. Sunil Gavaskar (India)
2. Ravi Shastri (India)
3. Sanjay Manjrekar (India)
4. Laxman Sivaramakrishnan (India)
5. Anjum Chopra (India)
6. Murali Kartik (India)
7. Scott Styris (New Zealand)
8. Simon Doull (New Zealand)
9. Danny Morrison (New Zealand)
10. Michael Hussey (Australia)
11. Lisa Sthalekar (Australia)
12. Matthew Hayden (Australia)
13. Melanie Jones (Australia)
14. Micheal Clarke (Australia)
15. Brendon Julien (Australia)

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+