జనవరిలో టీమిండియా పుల్ బిజీ: పూర్తి అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ ఇదే!

హైదరాబాద్: మరికొన్ని గంటల్లో ఈ దశాబ్దం ముగియనుంది. అన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లు ముగిసిన నేపథ్యంలో క్రికెట్ అభిమానులు వచ్చే దశాబ్దం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది ఆసియా కప్‌తో పాటు టీ20 వరల్డ్‌కప్ లాంటి మేజర్ టోర్నీలు ఉన్నాయి.
టీ20 వరల్డ్‌కప్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తుండగా... ఇప్పటికే మొదలైన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2020లో కూడా కొనసాగుతుంది. దీనికి తోడు దక్షిణాఫ్రికా వేదికగా అండర్-19 వన్డే వరల్డ్‌కప్ అదనం. ఇలా, వచ్చే ఏడాది అద్భుతమైన టోర్నీలతో అంతర్జాతీయ క్రికెట్ కళకళలాడనుంది.
జనవరిలో భారత క్రికెట్ జట్టు ద్వైపాక్షిక సిరిస్‌లతో బిజీ బిజీగా గడపనుంది. ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరిస్ జనవరితో ముగుస్తుండగా.. ఐర్లాండ్ జట్టు పరిమిత ఓవర్ల సిరిస్ కోసం వెస్టిండిస్ పర్యటనకు బయల్దేరనుంది. కివీస్-ఆసీస్‌ల మధ్య మూడో టెస్టు జరగనుంది.
ఇలా, జనవరి మొత్తం అన్ని ప్రధాన జట్లు ఆయా షెడ్యూల్స్‌తో బిజీగా గడపనున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి 2020 ప్రపంచ క్రికెట్ షెడ్యూల్‌ని ఒకసారి పరిశీలిద్దాం...
ఆస్ట్రేలియా Vs న్యూజిలాండ్
జనవరి 3 నుంచి 7 వరకు, 3వ టెస్టు, సిడ్నీ
దక్షిణాఫ్రికా Vs ఇంగ్లాండ్
జనవరి 3 నుంచి 7 వరకు, రెండవ టెస్ట్, కేప్ టౌన్
జనవరి 16 నుంచి 20 వరకు, మూడో టెస్ట్, పోర్ట్ ఎలిజబెత్
జనవరి 24 నుంచి 28 వరకు, నాలుగో టెస్ట్, జోహన్నెస్‌బర్గ్
వెస్టిండిస్ Vs ఐర్లాండ్
జనవరి 7: మొదటి వన్డే, బార్బడోస్
జనవరి 9: రెండో వన్డే, బార్బడోస్
జనవరి 12: మూడో వన్డే, గ్రెనడా
జనవరి 15: తొలి టి20, గ్రెనడా
జనవరి 18: రెండో టీ20, సెయింట్ కిట్స్
జనవరి 19: మూడో టీ20, సెయింట్ కిట్స్
ఇండియా Vs శ్రీలంక
జనవరి 5: మొదటి టి20, గువహతి
జనవరి 7: రెండో టీ20, ఇండోర్
జనవరి 10: మూడో టి20, పూణే
ఇండియా Vs ఆస్ట్రేలియా
జనవరి 14: మొదటి వన్డే, ముంబై
జనవరి 17: రెండో వన్డే, రాజ్‌కోట్
జనవరి 19: మూడో వన్డే, బెంగళూరు
న్యూజిలాండ్ vs ఇండియా
జనవరి 24: మొదటి టి20, ఆక్లాండ్
జనవరి 26: రెండో టి20, ఆక్లాండ్
జనవరి 29: మూడో టి20, హామిల్టన్
జనవరి 31: నాలుగో టి20, వెల్లింగ్టన్
(ఈ పర్యటనలో మిగిలిన మ్యాచ్‌లు ఫిబ్రవరిలో జరుగుతాయి)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications