రిషభ్ పంత్ నోట బూతు మాటలు
ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మరో ఓటమిని మూటగట్టుకుంది. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లలో తొమ్మిదింటిలో పరాజయం పాలైంది. దీంతో ప్లేఆఫ్స్‌లో చోటు కోల్పోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోందీ జట్టు. ఇంకో మ్యాచ్ ఆడాల్సి ఉంది. అది లాంఛనప్రాయమే. గెలిచినా, ఓడినా పెద్దగా తేడా ఉండదు. ప్లేఆఫ్స్ కు ఏ రకంగానూ దోహదపడదు.
రాజస్థాన్ రాయల్స్ పై భారీ స్కోర్ చేసినప్పటికీ.. జట్టు ఓడిపోవడం కేప్టెన్ రిషభ్ పంత్ కు మింగుడు పడట్లేదు. తీవ్ర అసహనానికి గురయ్యాడు. పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ సందర్బంగా మాట తూలాడు. బూతు మాట మాట్లాడు. "We are a f***ing good team.." అని వ్యాఖ్యానించాడు. మిగిలిన వాటి కంటే కూడా నిజంగా గొప్ప జట్టు అని ధీమా వ్యక్తం చేశాడు.

పంజాబ్ కింగ్స్‌తో జరగనున్న చివరి మ్యాచ్‌పై గురించి అడిగినప్పుడు పాజిటివ్ గా బదులిచ్చాడు పంత్. "మా ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నా, ఒక జట్టుగా మేము గర్వపడుతున్నాం. మాకున్న టీమ్ ఎలాంటిదో మాకు తెలుసు, మేము కచ్చితంగా గెలవగలమని నమ్ముతున్నాం. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని, వ్యక్తిగతంగానూ, జట్టుగానూ మాకు పూర్తి ఆత్మవిశ్వాసం ఉంది. మాకు అనుకూలంగా జరగలేదని అందరికీ తెలుసు, కానీ అది మాది నిజంగా గొప్ప జట్టు అనే నిజాన్ని మార్చదు" అని పంత్ స్పష్టం చేశాడు.
లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రధాన సమస్య బ్యాటింగే. జట్టు సారథి పంత్ వ్యక్తిగతంగా పేలవమైన సీజన్‌ను ఎదుర్కొన్నాడు. అతను 12 ఇన్నింగ్స్‌లలో ఏడు సార్లు 20 లేదా అంతకంటే తక్కువ స్కోర్లకే పరిమితమయ్యాడు. నికోలస్ పూరన్ వంటి హిట్టర్లు కూడా ఫామ్ కోల్పోయారు. ఇటీవల ఒక సెంచరీ చేసి, రాజస్థాన్ రాయల్స్ పై 96 పరుగుల ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న మిచెల్ మార్ష్ కూడా ఈ ఐపీఎల్ ప్రారంభంలో మందకొడిగానే ఆడాడు.
బ్యాటింగ్ వైఫల్యాన్ని జట్టు డైరెక్టర్ టామ్ మూడీ స్వయంగా అంగీకరించాడు. మిడిల్ ఆర్డర్ సరిగా రాణించకపోవడం వల్లే పాయింట్ల పట్టికలో అట్టడుగు భాగంలో కొనసాగుతున్నామని పేర్కొన్నాడు. జట్టు బ్యాటింగ్ వైఫల్యం మొత్తం ప్రదర్శనపై గణనీయమైన ప్రభావం చూపిందని చెప్పాడు.
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్లు ఫర్వాలేదనిపించినా, బౌలర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. వైభవ్ సూర్యవంశీ 38 బంతుల్లో 93 పరుగులు, యశస్వి జైస్వాల్ 23 బంతుల్లో 43 పరుగులు చేసి లక్నో బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. 39 బంతుల్లోనే 221 పరుగుల లక్ష్యంలో 75 పరుగులు చేయడంతో రాజస్థాన్ ఓపెనర్లు విజయం దిశగా సాగారు.
ఎడమచేతి స్పిన్నర్ షాబాజ్ అహ్మద్‌ను బౌలింగ్ కు దించకపోవడాన్ని పంత్ సమర్థించుకున్నాడు. అది వ్యూహాత్మక నిర్ణయమని వ్యాఖ్యానించాడు. "ఎడమచేతి బ్యాటర్లు ఎక్కువసేపు బ్యాటింగ్ చేస్తున్నారు. అటువంటి సమయంలో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌ను ప్రవేశపెట్టడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే దిగ్వేష్ రాఠీ (4-0-38-0) తుది జట్టులో ఉన్నాడు. రాఠీ జట్టులో ఉన్నప్పుడు షబ్బీ రిస్క్ ఎందుకు తీసుకోవాలి?" అని పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications